కీచక భారతం
చట్టాలెన్ని దట్టించినా కలియుగ కీచక పర్వాలు ఇంకా సాక్షాత్కరిస్తున్నాయ్ కఠిన శిక్షలెన్ని విధించినా మరిన్ని మానవ మృగాలు స్వైర విహారం చేస్తున్నాయ్ షీటీమ్స్, ఫాస్ట్రాక్ కోర్టులు క్రియాశీలకంగా మెదిలినా మదగజాలు పెట్రేగుతున్నయ్ ఈ భారతావనిలో… అతివ జీవిత గతి తీరు గడియ గడియకు గండం గడప దాటితే అగ్నిగుండం పసిమొగ్గ మొదలుకొని చావుకు చేరువైన వృద్ధను…
