Category సాహిత్యం-శోభ

నాన్న

నాన్న…ఆ పదంలోనే ఆకాశమంత ప్రేమ, అమృతసమానమైన మాధుర్యం. బిడ్డకు ఊపిరి ఇచ్చింది అమ్మైనా, ఆ ఊపిరికి ఆలంబన నాన్న. గురువుగా నడకలు నేర్పి, గువ్వలా గుండెలో దాచుకొంటూ, పిల్లల బతుకుల్లో పున్నములు పూయించడానికి రేపటి కలల స్వప్న ప్రమిదలో తన చెమట చమురును పోసి తానే వత్తిగా కాలుతూ నిత్యం వెలుగులు పంచే అఖండ జీవనజ్యోతి…

పాద యాత్రలు

యాత్రలు పాదయాత్రలు పుణ్య స్థలాలకు మోక్ష యాత్రలు! ఓటరు దేవుళ్ల దర్శనాలకు బహురూపుల యాత్రలు! దేవుళ్లకు భక్తులకు మధ్య అనుబంధమైంది ఓటు! దేవుడు పొగడ్తలకు పొంగిపోయి ఐదేండ్ల కొకసారి అనుగ్రహిస్తాడు! దేవుళ్ళ ప్రాపకం పొందడానికి భక్తుల నానావిధ యాత్రలు! సిరికిన్‌ ‌జెప్పడు అన్నట్లు వస్తారు ఎండనక వాననక లారీల్లో దేవుళ్ళు! భజన భక్తులు ఎత్తైన గద్దెల…

‘‘ఉరి’’శాశ్వత పరిష్కారమా !?

మానవ మృగానికి ఉరి శిక్ష పడిందని న్యాయమే గెలిచిందని సర్వత్రా కేరింతల జల్లు   పత్రికల్లో పతాక టైటిళ్లు టివిల్లో ఠీవీగా ముచ్చట్లు   వ్యాట్సప్‌ ‌ఫెస్‌ ‌బుక్కుల్లో విషెస్‌ ‌పోస్టుల పరవళ్లు   ఇంకొద్ది గడియల్లోనే సద్దుమనుగు సందళ్ళు అటుపై శరా మాములు   రేపు మరో ‘‘రేప్‌’’ అదేవిధం సజీవ దహనం యధాతధం…

సోషలిస్ట్ ‌మార్క్ ‌కార్ల్ ‌మార్కస్

‌సామాజిక శాస్త్రవేత్త శ్రామికోద్యమ నిర్మాత సామ్యవాద సిద్ధాంతకర్త డెమొక్రటిక్‌ ‌విప్లవకారుడు కమ్యూనిస్టు పితామహుడు అతడే..కారల్‌ ‌హేన్రి మార్కస్   ‌ప్రపంచ భవిష్యత్‌ ‌రూపును సూత్రీకరించిన దార్శనికుడు   శాస్త్ర జ్ఞానం..చారిత్రక కోణం సామాజిక న్యాయ సూత్రాలు ఏకం చేసిన మేధో సంపన్నుడు   ఏ దేశ పౌరసత్వం లేకున్నా తాను ప్రపంచ పౌరుడినని ప్రకటించిన విశ్వమానవుడు…

కలలు కనాలి

అలసినశరీరం ఆదమరిచి రాత్రిని హత్తుకుని నిద్ర ముసుగులో అర్ద చైతన్య స్థితితో మగత కలల్ని కంటూ ఉదయాన్నే మెలకువ పలకరింపులకు కళ్ళు తెరుచుకున్నాయి!   రాత్రి కలల దారెంటా తడిమిన బాల్యపు స్మృతులు ఆనందాలు అమాయకతలు ఆగడాలు ఆటలు అల్లరులు నేస్తాల తీపి గుర్తులు అమ్మ ఒడి లోని వెచ్చదనం అలిగినవేళల్లో ఆత్మీయంగా అమ్మ హత్తుకున్న…

అభ్యుదయ కవి నేడు మహాకవి శ్రీ శ్రీ జయంతి

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావుగా లబ్ద ప్రతిష్టులైన శ్రీశ్రీ (ఏప్రిల్‌ 30, 1910 – ‌జూన్‌ 15,  1983). ‌విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించిన వారిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షులుగా, సినిమా పాటల రచయితగా ఆయన సుప్రసిద్ధుడు. శ్రీశ్రీ…

మెడ లోతు కలలో….

బొత్తిగా రుచి కోల్పోయిన మనసుతో ఆలోచనకు ఆకలిపోయింది. ఇష్టానికి విలువివ్వని లోపలి అభిమానం బయట చలామణి కాలేక ఇచ్చిన మనసును పిచ్చినే అపారమైన చులకనతో చిక్కిపోయి ఆసారా లేని ఊహ నిజమై ఆకారం దాల్చక చప్పబడిపోతుంటే ప్రతిరాత్రి మెడలోతు కలలో, కలం పడవలో నిద్రను తెడ్డుగా వేకువ దూరాన్ని అనుమతి లేని తీరాలకు ఆమెను ప్రాణం…

‌ప్రియ రాగాలు

ప్రియా… నీ ప్రేమానుభూతి నా మానసోద్యానంలో నిత్య పూలరుతువై నన్ను మురిపిస్తోంది మమతల పరిమళాల్ని పదే పదే వెదజల్లుతూజి నీ జ్ఞాపకం నా హృదయాన్ని అల్లుకుంది నువ్వు తొలకరివై పలకరిస్తేజి చిగుళ్ల సరాగాలతో దరహసిస్తుంది ఈ జీవిత వసంతం రమణీయాకృతినిచ్చేజి నీ ప్రేమ కోసం తపిస్తోంది నా గుండె శిల పున్నమి శిల్పి కోసం తహతహలాడే…

డబు జబ్బు

డబ్బు… తన రాక అందరికీ ఆనందం తన ప్రతి కదలికా ఓ అద్భుతం. తానుంటే  ఆనందమే లేకుంటే అంధకారమే. మనిషికీ,మనిషికీ మధ్య అడ్డుగోడలా నిలిచే ఇది ఉంటే ఊరంతా తనవారే లేకుంటే తనవారూ పరాయివారే. మనిషిని నడిపిస్తూ, మానవ బంధాలను మనీ బంధాలుగా మారుస్తూ, మనుగడసాగించే దీని లీలలెన్నో… పేరు ప్రతిష్ఠలను కొనిపెడుతుంది, అందలేని అందలాలను…