Category సాహిత్యం-శోభ

సైనికుడా… వందనం

కష్టాల సహారా ఒడిదుడుకుల ఇసుక తుఫానుల్ని ఆత్మస్థైర్యపు అడుగులతో ఎదుర్కొంటూ నీ జీవితం ఈ దేశపు పహారా అయిపోయింది… అనుక్షణం తొలిచేస్తున్నా ఉద్విగ్నం శత్రువు పదఘట్టనలపైనే చేస్తూ దృష్టిని నిమగ్నం నీ హృదయం ఆత్మవిశ్వాసపు పతాకమై రెపరెపలాడుతుంటుంది… గడ్డకట్టిన మంచులో నీ జీవన సమరాన్ని తిలకిస్తూ పగలూ, రాత్రీ.. అన్ని కాలాలూ నిన్ను మనసారా హత్తుకుంటూ…

భరతమాత ప్రశ్నిస్తోంది

స్వాతంత్య్రం సిద్దించి అప్పుడే వజ్రోత్సవ సంబరాలకు చేరువైందా? మారని మాటకొటుందని ప్రశ్నిస్తోంది నన్ను ఇన్నేళ్లు గడిచినా నేనింకా అభివృద్ది చెందలేదెందుకని? నా వొడిలో బతుకీడుస్తున్న సగటుమనిషి జీవనం గతెందుకు మారలేదని స్వేచ్ఛగా బతకలేక ఆకలితో అల్లాడే దీనుల పట్టింపెందుకులేదని బహుజనులకు అధికారం అందనిద్రాక్షేనా బలమొకరిది పెత్తనం ఇంకొకరిది ఇదేం న్యాయమంటూ ప్రశ్నిస్తోంది డెబ్బైఐదేళ్ళలో ఎందుకింక నీచరాజకీయాలంటూ…

రాఖీ నీ తేజస్సు!

అనాదిగా అతివలకు అండగా అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు మమకార మాధుర్యాలకు ఆత్మీయతకు రక్షణగా రాఖీ మహేంద్రునికి ఇంద్రపదవి మళ్ళీ కట్టబెట్టిన రాఖీ పాతాళం నుంచి విష్ణుమూర్తిని లక్ష్మీదేవికి అప్పగించిన రాఖీ ద్రౌపదికి వలువలు ఇచ్చి నారీ గౌరవం నిలిపిన రాఖీ అలెగ్జాండర్‌ ‌కు ప్రాణ బిక్ష పురుషోత్తముని హస్త రాఖీ యముని భగినీ హస్త భోజనం ఆత్మీయ…

కౌముది కుసుమం విరిసింది!

అంబరమంతా సంబరాలు కౌముది కుసుమం విరిసిందని! అంబుధి అంతా కేరింతలు పున్నమి రేడు తనవాడేనని! వేడి పుట్టించిన సూరీడు చీకటి దివ్వెను చూసి కాస్తంత సెద తీరాడేమో? వెన్నెల చూపించిన అమ్మ కమ్మటి బువ్వను తినిపించి కొండంత మురిపించిందేమో? మురిసిపోయిన కలువ చంద్రిక రాకతో అలుక వీడిందేమో? మదనుడు మల్లెలమాలల సాయం అక్కరలేదన్నాడేమో! జటాజూటధారి సిగలో…

వోటర్లారా ! మేల్కొనండి!!

ప్రజాస్వామ్య పాలనలో పార్టీల దండు యాత్రలో కై దండల కండువాల తల గుండుల జాతరలో సాగుతుంది సానుభూతి పర్యాటన యాత్ర. అటు ఇటు కానీ సూత్ర పాత్రులు వినయ విధేయతొత్తుల కాకుల కేకలు బాకాలు, భజంత్రీలు పూజలు, పురస్కారాలు ఇదీ ! వోటర్లను ఆకట్టుకునే కనికట్టు తమ తమ పార్టీల విజయానికి పనిముట్లు జనం ఛీ…

ఆవ్వ సుద్దులు

అసలే ఇది జనారణ్యం మానవమృగాలు సంచరిస్తాయ్‌ అ‌శ్రద్ధ వద్దు, జెర్రంత భద్రం బిడ్డా ! అడుగడుగునా  కాయం మీద కామనేత్రాలు నిఘా పెడతాయ్‌ ‌నిర్లక్ష్యం వద్దు,కాసింత కనిపెట్టుకో ప్రధానకూడళ్లలో నిర్లజ్జగా ప్రేమంటూ కక్షగట్టి వేటేయ మధపుటేనుగలు మాటేస్తాయ్‌ ఉపేక్ష వద్దు ఇంత సోయించుకో నిర్జనతావుల్లో అధనుచూసి నీ మర్మస్థానాన్ని కొల్లగొట్టేందుకు మేకవన్నెపులులు కాపు కాస్తాయ్‌ ఉదాసీనం…

పోరు పిడికిళ్ళు

కులం కత్తుల సాముచేసి తల తెగిపడ్డ మొండాలతో మనువుకు నైవేద్యం పెట్టండి మతం మంటలు రాజేసి దహించిన చితాభస్మంతో విగ్రహాలను ఆరాధించండి ఆధిపత్య విషం వెళ్లగక్కి చచ్చిన పీనుగల ఎత్తుకుని ఆలయ ప్రదక్షిణలు చేయండి నిరంకుశ కొరడా జులిపి చిందిన నెత్తుటి ధారలతో పాప పంకిలం కడిగేసుకోండి నల్లచట్టాల పలుగు వేటేసి బతుకుల నిలువునా కూల్చి…

తెలంగాణ జాతిపితకు జేజేలు

‘తెలంగాణ ఆశా జ్యోతి మహోద్యమ రథ సారధి మానవ హక్కుల వారధి ఉన్నత విలువల జీవనది యావత్‌ ‌జాతికి మార్గదర్శి కొత్తపల్లి జయశంకర్‌ ‌సారు స్వరాష్ట్ర సాధన ధ్యేయంగా సకలజన ఉన్నతి సమస్తంగా నిత్య కృషిచేసిన దార్శనికుడు తెలంగాణ పట్ల జరుగుతున్న అన్యాయాలు అసమానతలపై ధిక్కార స్వరమెత్తిన విప్లవుడు తొలి,మలి దశ ఉద్యమాలకు బాసటగా నిలిచిన…

ఆమె ఎన్నో…

ఆమె దాగేకొద్ది ఆ పరిచయానికి రుచెక్కువ. గొంతు దూరమయ్యేకొద్ది ఆ మాటలకు మత్తు ఎక్కువ. ఆమెలో మునిగేకొద్దీ ఆ లోతుకు దాహమెక్కువ. కాలం గడిచేకొద్దు ఆ జ్ఞాపకాలకు జీవమెక్కువ. ఆమెను చెప్పుకునేటప్పుడు మనసుకు వేగమెక్కువ తప్పుకుపోయేటప్పుడు ఆ బంధానికి భారమెక్కువ. ఆమెకు పంచేటపుడు భావాలకు భాధ్యతేక్కువ. పక్కనేఉన్నప్పుడు ఆ రోజంతా తీపెక్కువ. ఆమెను వ్రాసుకునేటప్పుడు కవితకు…