Category సాహిత్యం-శోభ

నువ్వు ఎవరో?

ఒక్కడివా? ఒంటరివా? ఏకాంతంగానా? ఏకాకిగానా? ఒక్కడివైతే పరవాలేదు! ఎప్పటికో అప్పటికి జోడీ దొరుకుతుంది! ఒంటరి అయితేనే భయం న్యూనత వరించి శూన్యం మిగులుతుందేమోనని! రాకపోకల్లో ఒక్కడై ఉండటం జీవిత ధర్మం! ఆలోచనల్లో ఒంటరై పోవటం బతుకు నాశనం! ఏకాంతంగా ఉన్నావా? పరవాలేదు! శాంతి కలిగి సంతోషం విరుస్తుంది! ఏకాకిగా మిగిలావా? ఇబ్బందే! అశాంతి మిగిలి ఆనందం…

నా వేదన

అమాయకులను అడుగడుగునా అణగదొక్కుతూ వారి కుత్తుకలను కత్తిరిస్తోన్న, కబందహస్తాల ధృతరాష్ట్రుని కౌగిలిలో చిక్కిన సమాజమిది, కంపుకొడుతున్న వాస్తవమిది. వివక్ష చూపెడి మూర్ఖుల ముంగిట విచక్షణ నశించిన హీనులు, పరితపించి పరితపించి సాగిలబడుతోన్న ఈ సమాజంలో అవమానపు అమాసలు ఎడతెరిపి లేక పలకరిస్తూ నిశీధిపొద్దుల్లోకి ఆహ్వానిస్తోంటే, నా తనువుని నిలువెల్లా నిరాశ తీగలు అల్లుకుంటున్నాయి. అవమానాల చేదు…

ఆత్మీయత అనురాగం

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు! మబ్బుల్లో…

తూకంరాళ్లు

తూచడం చాలా కష్టమైన పని. పరిణత, శిల్పం, వస్తుస్పృహ, భాషా వివేచనలను తూకంరాళ్లు వేసి విమర్శనాత్మకంగా  విశ్లేషించి తూచడమంటే సముద్రాన్ని ఎదురీది ఒడ్డున పడడమే. పలు సాహిత్యాంశాలపై 1994 నుండి 2022 మధ్య తాను రాసిన 34 సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలను తరాజు పేరుతో ఇటీవల పుస్తకంగా వెలువరించిన డాక్టర్‌ ‌కాంచనపల్లి గోవర్థన్రాజు లోచూపుతో సాగిన…

నీవు నవ్వుతూ ఈ నేలపై పోతుంటే

నీ నవ్వులన్నీ పువ్వులై పూస్తాయి ప్రియా… నీవట్లా ఆకాశానికి భూమికి మధ్య తేలిపోతావుంటే నీ నవ్వులన్నీ ఈ నేలపై చినుకులై కురుస్తాయి సఖీ… నీవట్లా అమావాస్య రాతిరి ఆకాశం నుండి నవ్వుతుంటే నీ నవ్వులన్నీ చుక్కలై మెరుస్తున్నవి చెలీ…. చెలీ…సఖీ…ప్రియా… నీ నవ్వులన్నీ పూలై పూసిన చినుకులలై రాలిన చుక్కలై మెరిసిన చూస్తూ ఆస్వాదించడమే నాకున్న…

‌ప్రశ్న తప్పదు

నిజాలు నిప్పులే వాటిని గుప్పెట్లో కాదు కొన్నిసార్లు గొంతులో దాచాలి కాలుతున్నా… కాల్చుతున్నా అబద్దాలు తప్పులే నాలుక చివరిలో వెలిగి మనసు మొదల్లో అంటుకుని జీవితమంతా ఆరిపోదు….ఆర్పలేము. నిజం నడిబొడ్డులో నడిచే అబద్దాలకు అబద్దం నుదుట గడచే నిజాలకు మనసే మనిషికి ప్రశ్నగా మనిషే జవాబు కాక తప్పదు.         –…

పువ్వుల పండుగ

ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ తీరొక్క పువ్వులతో రోజొక్క అలంకారముతో ముస్తాబై ఎంగిలి పూల బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచులందరూ ఘనంగా జరుపుకునే రాష్ట్ర పండుగ బతుకమ్మ అమ్మ, అక్కలందరూ కలిసి వాడ వాడనా బతుకమ్మ ఆట పాటలతో తెలంగాణ సాంప్రదాయం ఉట్టి పడేలా బతుకమ్మ సంబురాలు రాష్ట్ర సర్కార్‌ ‌బతుకమ్మ చీర…

ఉదయించే సూర్యుడు

పుట్టుకతో దళితుడైనా మానవీయ విలువలను ఆవిష్కరించిన కవిదిగ్గజం కుల వ్యవస్థపై తిరగబడ్డ నవయుగ కవి చక్రవర్తి దారిద్య్రం పై పోరాడిన విశ్వకవి సామ్రాట్‌ ‌స్వార్థం పై సమరం చేసిన కవి విశారదుడు మతసామరస్యాన్ని పెంచిన మధుర శ్రీనాధుడు అస్ఫృశ్యత పై గళమెత్తిన సాహితీ కవి కోకిల ‘వడ గాల్పులు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వం…

జయహో..తెలంగాణ బాపూజీ

మహోద్యమాల సారధి మూడు తరాల వారధి బడుగు జనుల పెన్నిధి తెలంగాణం జాతిపిత కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ బానిస విముక్తి కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన విప్లవకారుడు నిజాం నిరంకుశ పాలనపై నిప్పులు చిమ్మిన యోధుడు బూర్జువా వ్యవస్థ మీద ధిక్కార స్వరమెత్తిన ధీరుడు ముల్కీ ఉద్యమంలో … స్వతంత్ర సమరంలో ……