Category సాహిత్యం-శోభ

కార్తీక దీప మహోత్సవం

పరమ పవిత్త్రమైన దినం హరిహరుల ప్రతుష్టి మాసం దైవారాధనల శుభ తరుణం కార్తీక పౌర్ణమి మహోత్సవం ధ్వాదశి పౌర్ణమి వేళా ప్రాతఃకాల స్నానాలు నవ్య వస్త్రాధారణలు త్రికరణశుద్ధిగా పూజలు ఆకాశ దీపాల తేజస్సుతో ప్రతి వదనం పరమ ప్రసన్నం ప్రతి సదనం పవిత్ర ఆలయం ఉత్క్రుష్ట గీతాలపనలు ధ్యాన మంత్రోత్సరణలు సహస్ర శివనామ స్తోత్రాలు ఓం…

గడ్డి బెంబేలు

‌లంచం…అదో రోగం, సమాజానికి పట్టిన గ్రహచారం. ఎన్నిచట్టాలు వచ్చినా దానికి చుట్టాలే. ఆకలితో దేబురిస్తూ కంచం నిండితే చాలని ఘోషిస్తున్న జనులు కొందరైతే, లంచాలతో కడుపునింపుకోవాలని చూసే మరికొందరున్న నేటి సమాజంలో తాయిలాలతో,బుజ్జగింపు ఫీట్లతో రాజకీయం మకిలిపట్టిపోతోంది. స్వప్రయోజనాలు తప్ప ఏ జెండా అవసరంలేని రాజకీయాన్ని, డబ్బుపై వ్యామోహంతో గుడినీ,గుడిలో లింగాన్నీ దోచే మనస్తత్వం పుణికిపుచ్చుకొని…

ఆకాశంలో సంబరం

ఆకాశమంతా ఉల్కాపాతం మిలమిలా మెరిసిపోతూ గగనం నుండి  వెండితళుకుల హిమపాతం ధారగా కురిసిపోతూ! రోదశి యుద్ధంలో ఓడిన గ్రహాశకలాలన్నీ రాలిపోతూ చీకటి రాత్రిలో నింగినుండి భూగోళంపై క్షిపణుల్లా జారిపోతూ! శకునం చెప్పే తోకచుక్క కధనాలు, మబ్బులయుద్ధపు మెరుపు విశేషాలు, సిగపట్లకు రేగే ఉరుము ద్వానాలు అలసి సొలసి రాలిపోయే నక్షత్రాలు! కదిలి తరలిపోతున్న పాలపుంతలు, నీడభూతాలకు…

నేటి..మనుషుల తీరు

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు! మబ్బుల్లో…

నవోదయం

జీవితం వొక శిల అయిపోయిందని వొరిగిపోకు ఇప్పుడే ఆశల వులుల కలకలం మొదలైంది అది శిల్ప పరిమళాలతో వికసించడానికి… సంకల్పం వొక బిందువే అని క్రుంగిపోకు ఇప్పుడే ఆలోచనల జలాల ప్రవాహం ప్రారంభమైంది అది సింధువై ఆశయాల అలలతో వుప్పొంగడానికి… నేస్తం! సమైక్యతాసూర్యుడు సరికొత్త సామాజిక కిరణాలతో జగతిని జాగృతం చేయడానికి అలుముకున్న అలజడుల తిమిరాలు…

కిరీటం లేని రాజులా…

భిక్ష మెత్తుకునే అమ్మ భుజంపై గాఢనిద్రలో వీధులన్నీ ఊరేగే కిరీటం లేని రాజులా ఇష్టాలని పాలిస్తున్నాడు రెండు చేతులు కరచుకున్న కౌగిలిలో కురిసే కేరింతలే పేదరికంలో దుమికే జలపాతాలు నేలపై కాలు పెట్టకుండా ఒడి దాటకుండా చంక దిగకుండా వీపు మీదగా వాడి ఎగుడు దిగుడు చూపులు ఈ లోకానికి  చిక్కు ప్రశ్నలే…. – శ్రీ…

కాంతి సముద్రం

ఈ నాలుగ్గోడలే ఇలా మార్చాయి స్పష్టత సున్నంలా రాలిపోయింది అవగాహన పెచ్చులూడిపోయింది నలుగురు అరిస్తే నాలుక తడబడింది చదువు వివేకం కొయ్యబారిపోయాయి విజ్ఞత సిగ్గుతో మొహమాటంతో ఊగిసలాడుతూ ఏమీ అనలేకపోయింది మొహం ఓడిపోయినట్టు నీరుగారింది దేహం కుంచించుకుపోయింది గొంతు పడిపోయింది వణుకుతూ అగాధంలో ఊపిరికి గాలి అందట్లేదు కళ్ళు లోపలికి చూస్తూ కన్నీళ్ళను మింగుతున్నాయి బద్దలుగొట్టాలి…

మౌన ఊసులు

ఒంటరితనం పెల్లుబుకెత్తిన క్షణాల్లో ఎద ఇముడ్చుకోలేని జ్ఞాపకాలు మదిని ముంచెత్తగా, ఆవేదనలే సుడిగాలులై హృదిని అతలాకుతలం చేస్తోన్న సమయంలో, గొంతుగోడలో కూరుకుపోయిన, తరలిరాని గత స్మృతులను మననం చేసుకొంటోన్న అలసిన నిస్సహాయ మనసు బాధిస్తూ,రోదిస్తూ శిశిరపు వాకిట నిలిచి నిట్టూర్పు గేయాలు ఆలపిస్తోంటే జ్ఞాపకాల తడితో కళ్ళు చెమ్మగిల్లగా, అవధులు లేని గగనతలంలో విహరిస్తోన్న మౌనానికి…

మునుగోడు ముఖచిత్రం

కోళ్లు ఎగిరెగిరి పడుతున్నాయి రెక్కలొచ్చి కోళ్ల ధరలు అందకున్నాయి నాటు కోళ్ల మాట చెప్పవీలు లేదు వీధి వీధికొక కొత్త హోటళ్ళు రాత్రికి రాత్రే మొలిచి వెలుగుతున్నాయి వారుణీ వాహిని వరదలై పారుతోంది ఇన్నాళ్లూ టీవీ లలో దర్శనమిచ్చే రంగుల కండువాల రాజకీయ మేస్త్రీలు ఇంటింటికీ గడప గడపకూ ఓట్ల బిక్షకై కదలి వస్తున్నారు లేనివరుసలు…