Category కవితా శాల

సేవా తత్పరిణి మదర్‌ ‌థెరిసా

అల్బేనియాలో పుట్టింది రోమన్‌ ‌క్యాథలిక్‌ ‌సన్యాసిని అయింది భారత పౌరసత్వం స్వీకరించింది మిషనరీస్‌ ఆఫ్‌ ‌చారిటీని స్థాపించింది నూట ఇరవై మూడు దేశాలకు విస్తరింపజేసింది పేదలను అక్కున చేర్చుకుంది రోగస్తులను ఆదరించింది అనాధలకు అండగా నిలిచింది శరణాలయాలను నెలకొల్పింది అనేక పాఠశాలలను స్థాపించింది మరణ శయ్య పై ఉన్నవారికి పరిచర్యలు చేసింది మానవతావాదిగా అంతర్జాతీయ కీర్తి…

గుండెను ఈదిన గొంతు

మరిగిన మనసుతో అరిగిన బతుకులో నాలుక పారిన చోటల్లా మొలిచిన ప్రతి గుర్తు గద్దర్… మోసిన అనుభవాన్ని అక్షరంలో రంగరించి మెదడుకు రుచి చూపి చూపి పెలే పల్లవి మోతరా గద్దర్ నిప్పుల్ని నమిలి మింగి ముళ్లను వాటేసుకుని మట్టితో కలసి మెలసి మనిషిని గుండెలో ఈదిన ఈతరా గద్దర్ గుడిసె దిగులు గుబులు తెలిసి చెమట ఇంకిన బతుకు నడచి నలిగిన శరీరంలో పగిలిన ప్రతి కలను చూసి గొంతును ఆయుధంగా మ్రోగిన గళం గద్దర్ ఎత్తిన గొంతులో  వెలిగేత్తే  ప్రశ్నలు కత్తిలా దూసుకుపోయే పదునైన ఆలోచనలు మెరుపులా తాకే చురుకైన శక్తులు పాటలో శక్తికి పట్టం కట్టిన  వీరుడు గద్దరు…. …. చందలూరి నారాయణరావు.               9704437247

ఈశాన్యం మూల

ఈశాన్యం మూల కొండల్లో కోనల్లో ఆకాశం నిండా అలుముకున్న పొగ చూశారుగా.. మీరందరూ చూశారుగా.. ఆజ్యం పోసి మూడు నెలలైనా వీసమెత్తు కదలిక లేకుండా మొసలి కన్నీరు కార్చే గుంటనక్క మాటలు విన్నారుగా .. పచ్చని ప్రకృతి తల్లి ఒడిలో కొండల్లో లోయల్లో శాంతియుతంగా బతికే మా గుండెలు ఉలిక్కిపడుతున్నాయి ఏ పక్క నుంచి విద్వేషపు…

కాలంతో సంభాషించిన కవి కాలమ్స్

‌కోడం కుమారస్వామి, తెలుగు అధ్యాపకులు, ఎల్‌.‌బి. బి.ఇడి. కళాశాల, వరంగల్‌, 9848362803 ‌రచయితలు రాజ్యం చేతిలో బందీలయినపుడు ఆ నిర్భంధ పరిస్థితుల్లో నిరీక్షణ, మానవీయ సంబంధ బాంధవ్యాలు, నిరాశ, నిస్పృహలను ఏదో రూపంలో వ్యక్తీకరిస్తారు. జైలులో ఖైదీల ఆరాటాలు, ఆవేదనలు, ఉద్వేగాలను ‘ఆంధప్రభ’ పత్రికకు ఒక కాలమ్‌గా రాయడం కవి వరవరరావు గారికి పరీక్షలాంటిదే. బయటి…

పైశాచికం

కొన్ని పరిస్థితులకు తలవొగ్గితే నీ పరువేం పోదు నీ నిసహాయత చూసి హేళన చేయనీయి నవ్విన నాప చేను పండించి చూపించు చదువుకుంటేనే సంస్కారం వస్తుంది అనుకునే వెర్రి భ్రమల్లోబతకొద్దమ్మ తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దే కుసంస్కారులు తిరిగే పాడు లోకం ఇది నగ్నంగా నిన్ను ఊరేగించి వికృత చేష్టలు చేసిన సైకోల…

నగ్నంగా నడిచింది దేహం కాదు…..అది దేశం..

యుగాలు దాటొచ్చిన మనిషిని మృగాలుగా మార్చింది ఎవ్వడు ? పాలిచ్చిన అమ్మల రొమ్ములను బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి ఊతమిచ్చింది ఎవ్వడు ? వేట కుక్కల్ని ఉసి గొల్పింది ఎవ్వడు ? విద్వేషాన్ని రక్త నాళాలలోకి ఎక్కించింది ఎవ్వడు? తల్లుల జననాంగాల మీద తాండవమాడిన గాడిద కొడుకులను కని పెంచింది ఎవ్వడు ? నెత్తురుని మరిగించింది…

సకల భోగభాగ్యలు ఇచ్చే పండుగ

ఆషాడ మాసంలో వచ్చే పండుగ గ్రామదేవతలకు మొక్కులు తీర్చే పండుగ నైవేద్యాలు పెట్టే పండుగ సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే పండుగ ఆనందాలు వెల్లి విరిసే పండుగ పసుపు, వేపరెమ్మలతో ఊరేగించే పండుగ వర్షాకాలంలో వచ్చే రోగాలను తరిమేసే పండుగ శరీరం కుండగా భావించే పండుగ ఆత్మ దివ్య జ్యోతిగా తెలిపే పండుగ పోతురాజు చిందులు…

కాలుష్యపు కోరలు…

కాలుష్యం ఎవరివాళ్ళ కాలుష్యం దేనివల్ల మనేమే కాలుష్యం ఎందుకంటారా… పరిశుభ్ర పరికరం మనలో ఉండే చేదు తత్వం… తెలిసి తెలియని పని చేసి వర్గంలో చెట్టు ఉండే చోట కళేబరం… ఎవరి నిర్లక్ష్యం వాళ్ళ ధరిత్రి కూడా కన్నీరు పెట్టక జలపతితో భాదను పంచుకుంటుంది ఎవరి వాళ్ళ.? ప్రజలంతా నన్ను కాలుష్య కోరలతో నింపుతున్నారు ఎవరి…

ఎప్పుడు చూసినా!

ఎప్పుడు చూసినా ఆ కళ్ళల్లో ద్వేషం కురిపించడమేనా? కాసేపు అమృత ధారలు వర్షించు! ఎంత అందంగా ఉంటాయో? ఎప్పుడు చూసినా ఆ చేతులతో అందుకోవడంమేనా? కాసేపు ఇవ్వడం అలవాటుచేయి! ఎంత తేలిక పడతాయో? ఎప్పుడు చూసినా ఆ మనసులో ‘‘నా’’ అన్న భావమేనా? కాసేపు ‘‘మన’’అన్నది నేర్పించు! ఎంత ఒంటరితనం పారిపోతుందో? ఎప్పుడు చూసినా ఆ…

You cannot copy content of this page