మనుషుల పాట

ఈరోజు పొద్దున్నే వెలుతురొచ్చింది వెండిలా పరుచుకుంది వాకిట్లో చెట్లు నిశ్చలంగా పాటలు పాడుతున్నాయి కండ్లు ప్రకృతిని మొరపెట్టుకున్నాయి నీ అప్పు తిరిగి ఇచ్చేస్తాం ఆలస్యమైనా కడతాం మాటిస్తున్నాం మమ్ములను నీ వాసన దారుల్లో తచ్చాడనీయ్ అలగకు ఒరగకు క్షమించు గాయాలకు నూనె రాస్తే తగ్గవని తెలుసు మరచి మాయామోహంతో ఉన్నాం వైరుధ్యాల తలంపై తిరుగాడుతున్నాం వైషమ్యాలను…








