Category శీర్షికలు

‌శ్రీరామ కల్యాణోత్సవం

శ్రీరామ నవమి ఉత్సవ వేళా విశ్వ జగతి ఆధ్యాత్మిక మేలా పరమ పవిత్ర సంకీర్తన హేలా భక్త జనుల పారావశ్య  ఖేలా సర్వ పాపాల హరణం సకల లోక మంగళకరం సమస్త జీవ శ్రేయోదాయకం రామచంద్రుడు అవతరించిన చైత్రశుద్ధ నవమి శుభకరదినం పరమ ధర్మ పరిరక్షకునిగా సోదర బంధానికి ప్రతీకగా హనుమకు ప్రీతి పాత్రునిగా భక్తజనకు…

కేంద్రంలో ఆధిపత్యం కోసం కెసిఆర్‌…‌ రాష్ట్రంలో అధికారం కోసం బిజెపి

కేంద్రంలోనిభారతీయ జనతాపార్టీని గద్దె దించేందుకు గత కొంతకాలంగా టిఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బిజెపిని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలనన్నిటినీ కూడగొట్టే ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ విషయంలో ఆయన పార్టీలతో సంబంధం లేని వారిని మధ్యవర్తులుగా వినియోగించుకుని వారితో మంతనాలు జరుపుతున్నారు. కెసిఆర్‌ అం‌టేనే రాజకీయ ఎత్తుగడల్లో దిట్ట…

రాష్ట్రంలో రాజకీయ వార్‌ ..

రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ వార్‌ ‌నడుస్తోంది. ధర్నాలు, ర్యాలీలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది. విచిత్రమేమంటే అధికారపక్షం, ప్రతిపక్ష పార్టీలు ఏకకాలంలో ఉద్యమిస్తుండడంతో ఎవరు ఎవరిమీద దండయాత్ర చేస్తున్నారన్నది అయోమయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బర్నింగ్‌ ‌టాపిక్స్‌పైన తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏ టివి చానల్‌ ‌తిప్పినా, ఏ రాజకీయ వేదికపైన విన్నా ఈ రెండే…

వైవాహిక అత్యాచారం నేరం కాదా?

తాజాగా కర్నాటక హైకోర్టు తీర్పు తన భర్త తనపై వైవాహిక అత్యాచారానికి పాలపడుతున్నాడని భార్య పిటీషన్ దాఖలు చేయగా పరిశీలించిన కర్ణాటక కోర్టు వైవాహిక అత్యాచారం విషయంలో ప్రభుత్వం అనుసరించే విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పట్ల పురుషులు క్రూర మృగంలా ప్రవర్తించడానికి వివాహం అనేది లైసెన్స్ కాదని స్పష్టం చేసింది. ఏ వివాహ వ్యవస్థ…

విద్య, వైద్యం ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యత కావాలి

దేశ దశ, దిశలను నిర్ణయించే ప్రమాణాలుగా అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య, ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సదుపాయాలు అనబడే రెండు ముఖ్య అంశాలు గుర్తించబడ్డాయి. విద్యావంతులు పెరిగితే పేదరికం, నిరక్షరాస్యత, జనాభా విస్పొటనం సహజంగానే అదుపు చేయబడతాయి. విద్య, వైద్య సదుపాయాల కల్పన ప్రభుత్వాల కనీస బాధ్యతలుగా, ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. ప్రభుత్వాలు విద్య,…

‌క్షీణిస్తున్న తెలుగు భాషా వైభవం

తెలుగంటే శ్వాస, తెలుగంటే  హృదయ స్పందన,తెలుగంటే చలనం,తెలుగు మాట్లాడడం ఒక వరం.తేనె లోలికే తెలుగు వద్దనడం దౌర్భాగ్యం.తెలుగు బడిలో తెలుగు అక్షరం మాయమైతే,అమ్మ ఒడిలో తప్పిపోయిన బిడ్డ గతే.తెలుగు భాష అతి మృదు మథురమైన భాష.తేనెలొలికే తేటగీతితో,ఆహ్లాదంగా సాగే ఆటవెలదితో,పలుఉపమానాలతో, ప్రాసలతో అలంకారాలతో, అష్టావధాన,శతావధాన  ప్రక్రియలతో భాషకు జీవం పోసే చతురోక్తులతో,నానార్ధాలతో, పలు వ్యాకరణాంశాలతో విరాజిల్లిన…

భారత్, ఆస్ట్రేలియా – వాణిజ్యంలో ఉమ్మడి విజేతలు

భారత్,  ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (IndAus ECTA) గ్లోబల్ ట్రేడింగ్ రంగంలో భారతదేశ ఉత్తేజకరమైన పెరుగుదలలో మరొక నూతన అధ్యాయానికి నాంది పలికింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, దేశం తీవ్రమైన పోటీ ప్రపంచ మార్కెట్‌లో క్రమం తప్పకుండా నూతన  శిఖరాలను అధిరోహిస్తోంది. గత నెలలో, భారతదేశం 2021-22 సంవత్సరానికి $400…

‘‘‌వడ్ల’’ యుద్ధం

కాలం కళ్లెర్రజేసి కల్లోలం రేపినా కొరోనా కక్షగట్టి కకావికలం చేసినా కన్నీళ్లతో కడుపు నింపినం తప్పా బిచ్చం కోసం మిమ్ము అర్థించలేదు కనీస మద్దతు ధర ఇవ్వకున్నా ఎరువుల సబ్సిడీలు అందకున్నా నేలమ్మను నమ్ముకున్నమే తప్పా శాపనార్థాలతో తిట్టిపొయ్యలేదు సాగుబాటు నగుబాటు చేసినా జీవితాలతో చెలగాటం ఆడినా మారుతరని ఆశ పడ్డమే తప్పా గద్దె దించే…

రాజకీయ సంక్షోభంలో పాకిస్తాన్‌.. ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక

భారతదేశానికి ఆ చివరన పాకిస్తాన్‌, ఈ ‌చివరన శ్రీలంక… ఈ రెండు దేశాలు ఇప్పుడు సంక్షోభ పరిస్థితిని ఎదుర్కుంటున్నాయి. పాకిస్తాన్‌ ఎప్పటిలాగానే రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంటే, పాలనా వైఫల్యాలతో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో పడిపోయింది. ఇప్పుడు సహాయంకోసం ఇతర దేశాలను అర్థించే స్థితికి దిగజారింది. ఒక విధంగా తమ రాజకీయ లబ్ధికోసం విపరీత నిర్ణయాలు…