ప్రాణహిత పుష్కరాలకు వేదిక కానున్న కాళేశ్వరం
అవిభక్త కరీంనగర్, నేటి జయ శంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని మారుమూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్ పూర్ మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాళేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి ‘‘తెలుగు’’ పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి తీరాన…

