Category శీర్షికలు

సిట్టింగ్‌ ‌స్థానంకోసం కాంగ్రెస్‌.. అధికారంకోసం బిజెపి.. ప్రతిష్టగా టీఆర్‌ఎస్‌

మునుగోడు ఉప ఎన్నికల అన్ని రాజకీయ పార్టీల్లో టెన్షెన్‌ ‌పెంచింది. రానున్న శాసనసభ ఎన్నికలకు ఈ ఎన్నిక సెమీఫైనల్‌ అని పార్టీలన్ని భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌తన సిట్టింగ్‌ ‌స్థానాన్ని ఏ విధంగానైనా పదిలపర్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో సాధించుకున్న స్థానాల్లో అధికశాతం స్థానాలు ఆ  పార్టీ చేజారిపోయాయి. ఇప్పుడు మిగిలింది అయిదుగురు…

మరణానంతర జీవం

“పరో పకారం ఇదం శరీరం…..అనే ఉపనిషద్‌ ‌వాక్యమే కర్మభూమి అయిన భారత దేశంలో అవయవదానం కు స్ఫూర్తి దాయకంగా నిలిచింది.అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది…నాటిమాట,అన్ని దానాల్లో  కెల్లా అవయవ దానం అత్యున్నతమైనది…. నేటి మాట. ‘‘యావత్తు మానవాళి శరీర దానానికి ముందుకు వస్తే ….మానవుడు మరణాన్ని జయించినట్లే.’’… అన్నారు ప్రముఖ కవి శ్రీ శ్రీ”…

సైనికుడా… వందనం

కష్టాల సహారా ఒడిదుడుకుల ఇసుక తుఫానుల్ని ఆత్మస్థైర్యపు అడుగులతో ఎదుర్కొంటూ నీ జీవితం ఈ దేశపు పహారా అయిపోయింది… అనుక్షణం తొలిచేస్తున్నా ఉద్విగ్నం శత్రువు పదఘట్టనలపైనే చేస్తూ దృష్టిని నిమగ్నం నీ హృదయం ఆత్మవిశ్వాసపు పతాకమై రెపరెపలాడుతుంటుంది… గడ్డకట్టిన మంచులో నీ జీవన సమరాన్ని తిలకిస్తూ పగలూ, రాత్రీ.. అన్ని కాలాలూ నిన్ను మనసారా హత్తుకుంటూ…

భరతమాత ప్రశ్నిస్తోంది

స్వాతంత్య్రం సిద్దించి అప్పుడే వజ్రోత్సవ సంబరాలకు చేరువైందా? మారని మాటకొటుందని ప్రశ్నిస్తోంది నన్ను ఇన్నేళ్లు గడిచినా నేనింకా అభివృద్ది చెందలేదెందుకని? నా వొడిలో బతుకీడుస్తున్న సగటుమనిషి జీవనం గతెందుకు మారలేదని స్వేచ్ఛగా బతకలేక ఆకలితో అల్లాడే దీనుల పట్టింపెందుకులేదని బహుజనులకు అధికారం అందనిద్రాక్షేనా బలమొకరిది పెత్తనం ఇంకొకరిది ఇదేం న్యాయమంటూ ప్రశ్నిస్తోంది డెబ్బైఐదేళ్ళలో ఎందుకింక నీచరాజకీయాలంటూ…

రాఖీ నీ తేజస్సు!

అనాదిగా అతివలకు అండగా అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు మమకార మాధుర్యాలకు ఆత్మీయతకు రక్షణగా రాఖీ మహేంద్రునికి ఇంద్రపదవి మళ్ళీ కట్టబెట్టిన రాఖీ పాతాళం నుంచి విష్ణుమూర్తిని లక్ష్మీదేవికి అప్పగించిన రాఖీ ద్రౌపదికి వలువలు ఇచ్చి నారీ గౌరవం నిలిపిన రాఖీ అలెగ్జాండర్‌ ‌కు ప్రాణ బిక్ష పురుషోత్తముని హస్త రాఖీ యముని భగినీ హస్త భోజనం ఆత్మీయ…

కౌముది కుసుమం విరిసింది!

అంబరమంతా సంబరాలు కౌముది కుసుమం విరిసిందని! అంబుధి అంతా కేరింతలు పున్నమి రేడు తనవాడేనని! వేడి పుట్టించిన సూరీడు చీకటి దివ్వెను చూసి కాస్తంత సెద తీరాడేమో? వెన్నెల చూపించిన అమ్మ కమ్మటి బువ్వను తినిపించి కొండంత మురిపించిందేమో? మురిసిపోయిన కలువ చంద్రిక రాకతో అలుక వీడిందేమో? మదనుడు మల్లెలమాలల సాయం అక్కరలేదన్నాడేమో! జటాజూటధారి సిగలో…

రుబాయిలలో జ్ఞానలోకం…

వస్తుభావ వైవిధ్యాన్ని, సౌందర్యాన్ని దర్శిం పజేసే ప్రక్రియగా రుబాయిలకు పేరుంది. తెలుగు రుబాయిల ప్రయోక్తగా మహాకవి డాక్టర్‌ ‌దాశరథి ప్రసిద్ధులయ్యారు. ఆ పరంపరలో ఎందరెందరో కవులు రుబాయిలను రాశారు. మనసు మూల మలుపులో మినుకు మినుకుమనే జ్ఞాపకాన్ని పలకరించి  స్పర్శించిన అనుభూతిని డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి ఆలోచనాత్మకమైన తెలంగాణ  రుబాయిలుగా మలిచారు. కవి సునిశిత కవిత్వ…

వోటర్లారా ! మేల్కొనండి!!

ప్రజాస్వామ్య పాలనలో పార్టీల దండు యాత్రలో కై దండల కండువాల తల గుండుల జాతరలో సాగుతుంది సానుభూతి పర్యాటన యాత్ర. అటు ఇటు కానీ సూత్ర పాత్రులు వినయ విధేయతొత్తుల కాకుల కేకలు బాకాలు, భజంత్రీలు పూజలు, పురస్కారాలు ఇదీ ! వోటర్లను ఆకట్టుకునే కనికట్టు తమ తమ పార్టీల విజయానికి పనిముట్లు జనం ఛీ…

కాశ్మీరీ పండితుల భద్రత గాల్లో దీపమైందా..!

‘‘కాశ్మీరీ లోయలో ఉద్యోగాలు పొందిన మైనారిటీ హిందువులు, సిక్కుల ప్రాణాలకు హాని పొంచి ఉందని, ఏ క్షణంలోనైనా ఏ వైపు నుంచైనా ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే భయంతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది. గత మూడు మాసాలుగా మైనారిటీ హిందువులు వరుసగా హత్య చేయబడడంతో తమను సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రభుత్వానికి…