‘‘ అష్టకష్టాల్లో అవసాన దశ’’
‘‘గతమంతా కష్టాలతో నిండిన జీవన కావ్యాలే! హృదయం చెమర్చి పెల్లుబికిన గేయాలే!!స్వేదంతో తనువంతా తడిసి,రక్త మాంసాలనే మూలధనంగా వెచ్చించి, ఎముకల గూడైనా చలించక తపించి, కూటికోసం- గూటి కోసం అహరహం శ్రమించిన త్యాగమూర్తులు తుదకు అస్థిపంజరాల్లా, ప్రాణమున్న శవాల్లా కొట్టుమిట్టాడుతున్నారు.గుక్కెడు గెంజికోసం పోరాడుతున్నారు. పిడికెడంత గుండెకు చిటికెడంత ఆత్మీయ స్పర్శ కోసం అలమటిస్తున్నారు. అయినా అది…
