Category శీర్షికలు

విచారణ కమిషన్‌ల నియామకం

ప్రభుత్వాన్ని, పాలనను సంస్కరించాలని, పునర్నిర్మించాలని ప్రారంభమైన ప్రయత్నం అత్యంత దారుణంగా విఫలం అయిపోయింది.  ఆ వైఫల్యం మరింత బహిరంగంగా, నిస్సిగ్గుగా పద్ధతులను ఉల్లంఘించడానికి అధికారగణం నేరస్తులకు సహకరించడానికి, ప్రోత్సహించడానికి, మిలాఖత్ కావడానికి దారి తీసింది. తద్వారా అధికారగణం తనంతట తానుగాని, నేరస్తుల ద్వారా గాని శిక్షాతీత నేరప్రవృత్తిని పెంపొందించుకుంది.     విచారణ కమిషన్ల చట్టం 1956…

రాజ్‌భవన్‌ ‌నోట… ప్రగతి భవన్‌ ‌మాట

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచనలమేరకు రాజ్‌భవన్‌- ‌ప్రగతి భవన్‌ ‌మధ్య సయోధ్య ఏర్పడిందనేందుకు శుక్రవారం రాష్ట్ర శాసన సభ,మండలి  బడ్జెట్‌ ‌సమావేశాల ప్రారంభోత్సవ ఉపన్యాసం లో  గవర్నర్‌ ‌తమిళిసై సౌందరాజన్‌ ‌ప్రసంగం చెప్పకనే చెబుతోంది. ప్రసంగ పాఠాన్ని క్రితం రోజున్నే రాజభవన్‌ ‌వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించడం, అందులో ఒకటిరెండు చిన్న సవరణతో గవర్నర్‌ ‌సంతృప్తిని…

‘‌కాశీ’ని చేరిన విశ్వం

ఓ కళాతపస్వీ! రససిద్ధి పొందిన కళాస్రష్టా! నీవొక సమున్నత హిమశైలం, కళాత్మక చిత్రాలకు చిరునామా. సెలయేటికి నాట్యం నేర్పిన నాట్యాచారుడవు నీవు. ‘‘సిరివెన్నెల’’ వెలుగుల సాహసివి నీవు. నీ గజ్జెల ఘల్లు ప్రేక్షకుల గుండెల్లో ఝల్లు, సరిగమలతో నీ ప్రేమలేఖలు వారి హృదయాల్లో చక్కిలిగింతలు. నీ అమృత గానాలు అమితానంద హృదయరాగాలు. నాద వినోద నాట్య…

గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మంగళం పాడనున్నారా ?

 ‘‘ఉపాధి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోవాలి కానీ అందుకు విరుద్దంగా ప్రతి సంవత్సరం కేటాయింపులలో తగ్గింపు జరుగుతున్నది. పథకాన్ని నీరుకార్చడం, బడ్జెట్‌ ‌కేటాయింపులలో ఉపాధి హామీ పథకం కేవలం 1.3 శాతం,  రాబోయే రోజులల్లో క్రమేణా రద్దు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంత పేదలకు , అసంఘటిత రంగంలో ఉన్న రైతు కూలీలకు కడుపు నింపేదిగా…

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మగ్దూం మొహియుద్దీన్

హైదరాబాద్‌ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచమంతా గర్వించేలా, గౌరవించేలా తన గళం (ఉపన్యాసం) తోనూ, కలం తోనూ ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి మగ్దూం మొహియుద్దీన్. భారత దేశంలో వచ్చిన ప్రగతి శీల రచయితల ఉద్యమానికి హైదరాబాద్‌లో జీవం పోసింది మఖ్దుమే. నాలుగు దశాబ్దాలకు పైగా కమ్యూనిస్టు ఉద్యమాలకు, సాహిత్య సృజనకు తన జీవితాన్ని అంకితమిచ్చాడు. మొక్కవోని…

బొరుసునూ చూడు!

ఏమిటీ? నీవో గాయపడ్డ మనిషివా? ఆశల రెక్కలు తెగి వేదనాశ్రువులు నీ కలల కళ్ళను ముంచేస్తున్నాయా? కోరికల కుత్తుకల్ని కత్తిరిస్తూ, నీ గెలుపుగమ్యాలను వెతల శూలాలు తూట్లు పొడుస్తున్నాయా? అవకాశలు ఎండమావులై ఆశలను రేకెత్తిస్తున్నాయా? నిరాశానిస్పృహల వ్యాఘ్రం నీ ఆశయ దేహాన్ని కబళిస్తోందా? నవ్వుతోంది నీ అంతరాత్మ నిన్ను చూసి. కష్టాల కడలిలో, శిథిలమైన నావలో…

మన ఊరు మన బడి

మన ఊరు మన బస్తి బడి సకల వసతులు మెరుగుపడి అయ్యింది చదువులమ్మ ఒడి పిల్లలను జ్ఞానులుగా మలచే మడి ప్రభుత్వ బడిలో మొదటి అడుగు బావి జీవితానికి పడుతుంది గొడుగు తెలంగాణ ప్రభుత్వ బడులు బావి భవితకు బంగారు సోపానాలు పేద విద్యార్థులకు వరాలు మన ఊరు మనబడి కార్యక్రమాలు రేపటి పౌరులను తయారు…

నిర్మలమ్మ డిజిటల్‌ ‌పద్దు 2023-24….

‘‘అసలు బడ్జెట్‌ అనగా నిర్వచించిన కాలానికి జమలు, ఖర్చులు అంచనా ఆర్థిక ప్రణాళికగా అనుకోవచ్చు. తరచుగా ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ముందుగా గత సంవత్సరంలలో వచ్చిన ఆదాయ,వ్యయాల ఆధారంగా తయారవుతుంది.ఇది ప్రణాళికాబద్ధమైన అమ్మకపు ఖాతాల, ఆదాయాలు, వనరుల పరిమాణాలు, ఖర్చులు, ఆస్తులు, భాధ్యతలు, నగదు కేటాయింపులు ఇలాంటి అన్నిటినీ పరిగణించాల్సి ఉంటుంది.’’ బడ్జటు లేదా…

అంతరిస్తున్న చిత్తడి నేలలు జీవ మనుగడకే ప్రశ్నార్థకాలు

‘‘‌నీటితో నిండి ఉన్న చిత్తడి నేలలుగా సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, వరద మైదానాలు, తడి నేలలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, మడ అడవులు, చేపల చెరువులు, వరి మడులు, మడుగులు, మానవ నిర్మిత నీటి నిల్వలు లాంటి నిర్మాణాలు వస్తాయి. 1900వ ఏటి నుంచి నేటి వరకు చిత్తడి నేలలు సగానికి పైగా…