వ్యవసాయ ప్రాధాన్యత బడ్జెట్ రావాల్సిందే !
దేశంలో ఆహారధాన్యాల సేకరణ,వ్యవసాయ విధానంలో మార్పులు రానంత వరకు ..వాటి ధరలు అనూహ్యంగా పెరుగుతూనే ఉంటాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలను బలోపేతం చేయడంతో పాటు, ఆహారధాన్యాల దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. అందుకే ఎంతగా శ్రమించినా రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కవు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. కార్పోరేట్ దిగ్గజాలకు…
