Category శీర్షికలు

‘‌తెలంగాణ’కు దర్వాజ ఖమ్మం

రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లా అత్యంత కీలకంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న రాజకీయ పార్టీలన్నిటికీ ఖమ్మం వేదికగా మారింది. తెలంగాణపై ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్న పార్టీలన్నీ ఖమ్మంనే తమ ప్రధాన కేంద్రంగా చేసుకుంటున్నాయి. మరో నాలుగైదు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికల కోసం చాలాకాలం ముందునుండే సమాయత్తమవుతున్న జాతీయ,…

మాటలకే పరిమితమైన మహిళా అభ్యున్నతి

తెలంగాణ రాష్ట్ర సాదనోధ్యమంలో మహిళల పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాయుధ రైతాంగ పోరాటంలో స్త్రీ లను వివస్త్రలను చేసి బతుకమ్మలాడించిన పురుషాధిక్యతపై ఎక్కు పెట్టి బరిగీసి కొట్లాడిన చరిత్ర మహిళలకు ఉంది. ఈ స్ఫూర్తితో వెట్టిచాకిరి, గృహ హింసలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, దూడల సాలమ్మ, ఈశ్వరిబాయి, సదా లక్ష్మి, సరోజినీ…

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం

అగ్ని వలన జరిగే ప్రమాదాలను అగ్ని ప్రమాదాలు  అంటారు. ఇవి వేడి ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. పాదచారులు, గుర్తు తెలియని వ్యక్తులు బీడీలు, సిగరెట్లు తాగి వాటిని ఆర్పకుండా అలాగే పారేస్తుం డటంతో అవి అంటుకొని మంటలు పాకి…

ఆడబిడ్డలకు అండగా…

ఆరోగ్యలక్ష్మీ పథకంతో తొమ్మిదేళ్లలో సుమారు 36,26,603 మంది మహిళలు లబ్దిపొందారు. బ్యాంకులు స్వయం సహాయక బృందాలకు 3,738.67 కోట్ల రుణాలు ఇవ్వగా, 2022-23 నాటికి అది రూ. 12,722.14 కోట్లకు చేరుకుంది…సఖి కేంద్రాలు 24/7 పనిచేస్తాయి. ప్రత్యేకంగా మహిళా ప్రయాణికుల రక్షణ/రవాణా కోసం ప్రభుత్వం 16షీ టాక్సీలను ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌, ‌జూన్‌  12: ఆరవై ఏళ్ల…

యువత ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలంటే..!

నేటి సమ కాలీన ప్రపంచంలో ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతు న్నాయి.దీనికి కారణా లేంటి? దీనికి కారణం ఎవరు? ఆత్మహత్య చేసుకోవడానికి,ఆ దిశగా ఆకర్షితులు కావడానికి ఎవరైనా ప్రేరేపిస్తున్నారా అనేది ఒక సారి దీనిని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇందులో ముఖ్యంగా ఆత్మహత్యలతో ఎక్కువగా ఉంటున్నవారిలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది.ఉక్కు నరాలు,ఇనుప కండరాలు…

బిజేపిలో ఈటల ఒంటరవుతున్నాడా !

తెలంగాణ భారతీయ జనతాపార్టీలో హుజురాబాద్‌ ఎంఎల్‌ఏ,  ‌బిజెపి చేర్పుల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఒం‌టరి వాడవుతున్నాడా అంటే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అవుననేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌తో సమానంగా పోరాటంచేసిన వ్యక్తిగా తెలంగాణ ప్రాంతంలో ఈటల రాజేందర్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉంది. పోరాటంలో ఏర్పడిన ఎన్నో క్లిష్టపరిస్థితుల్లో సంయమనంపాటిస్తూ,…

పైశాచిక కదనకాండ

మాస్కో మూకల పైశాచిక దాడుల్లో.. గాల్లో కలిసిన లక్షల జవాన్ల ప్రాణాలు వేలల్లో శ్వాస విడిచిన సామాన్య జనాలు లక్షల్లో నిరాశ్రయులైన అభాగ్యుల ఆక్రందనలు పైశాచిక కదనకాండకు నిలువెల్లా చిధ్రమై.. విలవిల్లాడుతున్న ఉక్రెయిన్‌ ఆవాసాలు ! బతుకు పంటల్ని పండించుకోవాలని.. తపించే సామాన్యుల కలల్ని కాలరాసి.. హరిత కోక కట్టుకున్న భూమాతని.. నెత్తుటి గాయాల జీవచ్ఛవంగా…

జరాసంధ వధ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి పిడికిలితో వారు కొట్టుకుంటూ ఉంటే, కొందరు గజగజావణికిపోయారట, ఒకరినొకరు హింసించుకున్నారట. జరాసంధుడు అలసి పోయాడు. భీముడు అతగాడిని రెండు చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. ఆ క్షణంలో కృష్ణుడు భీమునికి సైగా చేసాడు. ఒక గడ్డిపరకను రెండుగా చీల్చి పడవేశాడు. భీమసేనుడు అలాగే అని జరాసంధుని రెండుగా చీల్చి పడవేశాడు.…

నోట్లయినా ఉండాలి… నోట్లో నాలుకైనా ఉండాలి..

వర్తమాన మానవ చరిత్ర అత్యంత విషాదకరంగా మారింది. నిలకడ లేని మనస్తత్వాలు, నిజాయితీ లోపించిన మనుషుల మానసిక పరిపక్వత లేని ప్రవర్తన వలన మానవ జాతికున్న విశిష్ఠ లక్షణాలు అదృశ్యమై పోతున్నాయి.మానవ స్వభావాలు వికృతంగా మారిపోతున్నాయి. కరోనా సమయంలో చాలా మందిలో మానవత్వం వెల్లివిరిసింది. మనం ఎలా బ్రతకాలో నేర్పించిన కరోనా పాఠాలు గుణపాఠాలు కావాలని…