అల్లిక జిగిబిగి

చేపల వేట నక్కలు గద్దెలపై జ్ఞానంపై దాడి శ్రమ దోపిడి కర్మకష్టాల ఊబి కార్మికసమ్మె ఆమె పాఠాలు విప్లవ సిద్ధాంతాలు అమ్మ నవల జీవన వైనం పండుగ ఆనందాలు దక్షిణాయనం మూడాసులాట రొక్కం ముక్తికి చోటు ఊచల బాట -రేడియమ్

చేపల వేట నక్కలు గద్దెలపై జ్ఞానంపై దాడి శ్రమ దోపిడి కర్మకష్టాల ఊబి కార్మికసమ్మె ఆమె పాఠాలు విప్లవ సిద్ధాంతాలు అమ్మ నవల జీవన వైనం పండుగ ఆనందాలు దక్షిణాయనం మూడాసులాట రొక్కం ముక్తికి చోటు ఊచల బాట -రేడియమ్

కాళ్ళూ రెక్కలూ లేని తరం మొలిచిందని కలతపడ్డా కన్నీటి పొరలు ఒక్కొక్కటీ ఆవిరవుతున్నాయి అలా గాలిలో తేలుతున్న ఒక చిన్న నినాదం వేసవి రోడ్ల పొగమంచులో నిన్నటి జ్ఞాపకంలా వినిపించింది ఆ నినాదం ఎవరిదీ ఎవరి కోసం ఎందుకోసం దేనికోసం ఆ చిన్న నినాదం విన్నప్పుడు తెలియలేదు కానీ ఏదో ఒకమార్పు చిన్నగా గుండెల్లో కొట్టుకుంది. ఇన్నాళ్లకి నేను మళ్ళీ…

మెరుపు తీగెలు పువ్వులు కొమ్మనుండి వేరుపడ్డామని కుమిలిపోలేదు! దేవుని శిరస్సెక్కి కూర్చున్నామని ఆనంద పడిపోలేదు! దండలో గుచ్చిన పువ్వులు నొప్పిని మర్చిపోయి దేవుని దేహం మీద దొర్లాడాయి! అందుకు దారానికి కృతజ్ఞత చెప్పుకోకపోయినా దేవునికి కృతజ్ఞత చెప్పుకున్నాయి! సూది దిగలేదని దారం తమని అదుపు చెయ్యని విడివిడి పువ్వులు విచ్చలవిడిగా దేవుని శిరసుమీదా తామే సిరిపాదంమీదా…

ఇవిగో రాలిపడ్డ ఆకులపై కాలం వేసిన వేలిముద్రలు కేలండర్ తీగపై ఆరబెట్టిన అంకెల్లా తేదీలు జీవితం నమిలి ఉమ్మేసిన నిమిషాలు, గంటలు ఇవిగివిగో కాలదోషంలేని కథలు చెప్పే రాతి సాలభంజికలు ఎప్పటికీ ఎండని రాజుగారి ఏడు చేపలు ఇంకుడుగుంతల్లో ఇతిహాసపు ఇసుకరేణువులు ఇదిగో ఇదిగిదిగో లౌల్య లోలకపు మాయలో చిక్కుకున్న భ్రమాస్పదులు మైనపు రెక్కలతో ఎగిరే…

ఆకులు వాలిపోగా కొమ్మలు పుల్లలౌతుంటే పూలిక రావని తెలిసినా ఊరికెనే ఉండిపోయా ఆకాశం వాగ్ధానం యిచ్చి, తప్పినా వాన రానందుకు చెరువు కాలువలో పారనందుకు ఊరికెనే వుండిపోయా విత్తనాల, మందుల మల్టీనేషనల్ మర్మం తెలిసినా పంట పెట్టుబడి రాబడి నిష్పత్తి వైరం అనుభవించినా నాగలి ధర్మంతో నడవక తప్పదనీ ఊరికెనే వుండిపోయా ఐదేళ్ళ కొకసారి బతికున్నట్లు ఓటు…

ఇప్పడు నువ్వు ఒక నిషేధాన్ని నిషేధించాల్సి ఉంది ఇప్పడు నువ్వు నీ అస్థిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంది అడవిలో కోవర్ట్ ఆపరేషన్లతో రాజ్యం హత్యలు చేస్తూ ఆదివాసి గూడెలల్లో యుద్ధ విమానాలతో బాంబులు వర్షం కురిపించిన సరే నీ ఉనికిని ఆవిష్కరించుకోవాల్సి ఉంది శత్రువును ఎదిరించడమే నీ ధ్యేయమైనప్పుడు ఏ మార్గాన్ననుసరిస్తేనేం? శత్రుశేషం నీ ఆశేషత్యానికి దారి…

తెలుగు సాహిత్యం అనాదిగా మహోన్నత ప్రవాహం. నాటి పద్య కవితా వైభవం నుండి ఆధునిక వచన కవిత్వం, కథానిక, నవలల వైవిధ్యం వరకు తెలుగు సాహిత్య ఖజానా అపారమైనది. అయితే, నేటి డిజిటల్ యుగంలో, సమాచార విప్లవం, పాశ్చాత్యీకరణ ప్రభావాల నేపథ్యంలో, తెలుగు సాహిత్యం వెనుకబాటుకు గురవుతోందా? అసలు ‘వెనుకబాటు’ అంటే ఏమిటి? నాణ్యతలో కొరవడటమా,…

“ఎన్ని సార్లు చెప్పాలి?” “పర్లేదు చెప్పు, నీకు తాగే వోపిక వుంది. నాకు వినే వోపిక వుంది” “అంటే?” “సండే వీకెండ్ వదిలేసెయ్, మండే?” “ఊ… మా ఫ్రెండ్‌వాళ్ళ మేరేజ్ డే, నువ్వొచ్చావ్ కదా?” “సాక్షాలు వద్దు. ఫ్రెండ్స్‌తో తాగావ్, వోకే. ట్యూజ్ డే?” “మా కొలీగ్ రిటైర్మెంట్ ఫంక్షన్, ప్రెజర్ చేస్తే?” “వాళ్ళకోసం ప్రెజర్…

అక్షర జీవనదులకు పల్లెపలుకులతో ప్రాణంపోసి జానపద జవసత్వాన్ని నింపి ప్రపంచ పటంపై మట్టి పాటల కలలను పారించారు పనైపోయిందనీ అవనిపై మౌన మునిలా అందెశ్రీ అస్తమించారు కాలం గుండెను చీల్చుతూ మట్టి కిరణాల ప్రవాహమై మన గుండెల్లో కవనోదయ కాంతి పాటై ప్రతిధ్వనిస్తున్నారు తెలంగాణ భావాల ఉద్యమ గొంతుకై నిలిచి మానవత జాడకై…