Category శీర్షికలు

లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలి

2023 సంవత్సరానికి గాను ఆర్థికశాస్త్రములో ప్రతి ష్ఠాత్మక నోబెల్‌ ‌బహుమతిని అమెరికాకు చెందిన ఆర్థిక వేత్త, ప్రొఫెసర్‌ ‌క్లాడియా గోల్డిన్‌ ‌కి వరించింది. స్త్రీ పురుషుల మధ్య వేతనాలు, లేబర్‌ ‌మార్కెట్‌ అసమా నతలకు గల కారణాలను విశ్లేషణ చేసినందుకు గాను ఈమె ఈ అవార్డును పొందారు. 1990లో హార్వర్డ్ ఎకనామిక్స్ ‌డిపార్ట్‌మెంట్‌లో పనిచేసి పదవీవిరమణ…

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బిజెపి

– మండువ రవీందర్‌రావు తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బిజెపి ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచార సభకు శ్రీకారం చుట్టింది. షెడ్యూల్‌కు ముందే  ఈ సభ ఏర్పాటు నిర్ణయం జరిగినప్పటికీ, ఎన్నికల నియమావళి పరిధిలోకి వెళ్ళడంతో కేంద్రం ఎలాంటి తాయిలాలను ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన…

కులగణన పై చిత్తశుద్ధి లేని కేంద్రం

ఇటీవల, బీహార్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం కులాల సర్వే, 2023 యొక్క ఫలి తాలను విడుదల చేసి ంది, ఇది ఇతర వెను కబడిన తరగతులు  మరియు అత్యంత వెనుకబడిన తరగతులు  కలిసి రాష్ట్ర మొత్తం జనాభాలో 63% ఉన్నట్లు వెల్లడించింది. బీహార్‌ ‌లో నిర్వహించిన  కులగణన మతాన్ని  చీల్చేది గా ఉందని  ప్రధాని  పరోక్షంగా  వెల్లడి…

నగారా మోగింది… చెయ్యి వణుకుతోంది..!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. వారంటీ లేని కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో ముందస్తు మేనిఫెస్టో ప్రకటిం చింది. 65 ఏండ్లు అధికా రంలో ఉండి,తాము అధికారం లోకి వస్తే రాష్ట్రానికి ఏదో చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికింది. తెలంగాణ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాల పాటు అరిగోస పడేందుకు కారణం ఈ కాంగ్రెస్‌…

మరపురాని, మరచిపోలేని మజిలీలు …

కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఉద్యోగులందరం పదిరోజులపాటు  పెన్ డౌన్ ప్రకటించాం. జేఏసీ నిర్మాణం కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే.  రాజకీయ పార్టీలకు అతీతంగా అప్పుడు బీజేపీ, సీపీఐ, టి.ఆర్.ఎస్ పార్టీలు కలసిసొచ్చాయి. రాష్ట్ర సాధనకు వెళ్లేలా చేసింది. తెలంగాణ ఉద్యమంలో సిద్ధిపేట గర్జన అనేది. ఒక మలుపు. రెండవది పెన్ డౌన్.  ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆ…

మానవత్వం కోసం అన్వేషణ…

ఒక్కరోజుతోనే ముగిసిపోయే /  ఊరి జాతరలా ఎన్నికల పండగ… రాజకీయ గొంగట్లో/  విశీర్ణమౌతున్న విలువల గొంతుకలు/ ఎంత గుక్కపట్టి ఏడ్చినా /  రెక్కలు విదుల్చుకోలేక కునారిల్లుతున్నాయి అని వర్తమాన రాజకీయాల విచిత్రాలను ఓట్ల సంత కవితలో  డా.ఎన్‌. ఈశ్వరరెడ్డి విశ్లేషించారు. నాకొక మనిషి కావాలి అన్న శీర్షికన 43 కవితలతో ఆయన కవితా సంపుటి వెలువడింది.…

దుప్పటి

పక్క ఎక్కిన వెంటనే కౌగిట్లో చేరుతుంది! చీకటి మాటు సిగపట్లకు చాటు ఉంటుంది! తనువుతో సరసంలో ఒక్కోసారి కాళ్ళు కనిపిస్తే, ఇంకోమారు తల బయటకు వస్తుంది! చలి గిలిగింతలు ఎక్కువైతే వెచ్చని కౌగిలింతలు తనవే అవుతాయి! ఉహుహూ అంటూ సల్లాపానికి దిగితే ఆహాహా అంటూ ముద్దుల అల్లరి తనదే అవుతుంది! అలసిసొలసిన దేహానికి ఆదమరపు ఇస్తుంది!…

ఈ శతాబ్ది శతకం

కొన్ని ప్రవహించే మొహాలను చూశాను దేశాలను దాటుతూ నిరంతరాయంగా అవి కోరస్‌ ఆలపిస్తూ విషాద నాటకానికి తయారవుతున్నవి వాటి మాస్కులను ఏ యుద్ధబీజాలకో తగిలించి వ్యసనానికి సహనాన్ని నేర్పే పాత్రలకై విశ్వ గురుత్వ స్థిరాంకాలను ఏర్పరుస్తూ విఫలమైనవే.. అవి ఏడుస్తున్నప్పుడు కన్నీళ్ళు జిగురు రంగు రక్తపు చారలుగా మరకల మడతలుగా హోర్డింగ్‌ చేయబడ్డవి ఇది ప్రకటన!…

శరత్కాల చంద్రబింబం

సునామీలు సుడిగుండాలు కొండలు పిండి చేసేది యవ్వనం హద్దులు దాటే పద్దుల కు అడ్డుకట్ట వేసేది వృద్ధాప్యం వాగై వరదై ఉదృతమై ఉప్పొంగే ప్రవాహం యవ్వనం పారి పారి తేరుకున్న నిర్మల నిచ్చల జలం వృద్ధాప్యం అనుక్షణం ఆరాటంలో ఆవిరి అయ్యేది యవ్వనం కాగి కాగి చల్లారిన స్వచ్ఛమైన మైన పాలమీగడలు వృద్ధాప్యం కల్లోల కడలి…