– చేవెళ్ల బస్పు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
– మంత్రులు ప్రమాదస్థలికి వెళ్లాలని ఆదేశం
– అన్ని విభాగాలను రంగంలోకి దింపాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను కలిచి వేసిందన్నారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని డీజీపీ, సీఎస్‌లతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతోపాటు తగినన్ని అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని సీఎం ఆదేశించారు. సీఎం అదేశాలతో సీఎస్ అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు. చేశారు. వెంటనే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రమాద స్థలికి చేరుకొని దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ కమిషనర్, ఫైర్ డీజీని అదేశించారు. గాయపడిన వారికి తగిన వైద్యం అందించేందుకు గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం అదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారందరినీ కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని, హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన చోట దృశ్యాలు బాధ కలిగించాయని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తరుపున తగిన పరిహారంతో పాటు సాయం అందించే అన్ని చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులను ఆదేశించారు.ప్రమాదాలు జరిగినపుడు ఆర్టీసీ తరపున అందించే బీమాతో పాటు బాధిత కుటుంబాలకు భరోసానిచ్చే చర్యలు వేగంగా చేపట్టాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





