ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 15 : ఏకశిలా పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తలసేమియా వ్యాధి గ్రస్తుల పిల్లలకు సహాయార్థం రక్తదాన శిబిరాన్ని (Blood donation camp ) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది వాకర్లు స్వచ్చందంగా పాల్గొని రక్తాన్ని అందించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రాజిరెడ్డి మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులకు తీవ్ర రక్త కొరత ఉందని, కాబట్టి వాకర్స్ అందరూ స్వచ్ఛందంగా రక్త దానం చేయాలని కోరారు. అసోసియేన్ ఆధ్వర్యంలో పార్కులో ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. రక్తదానం చేయడం వల్ల  చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ గవర్నర్ కూరాకుల భారతి, పూర్వ గవర్నర్ ఎల్లా గౌడ్, గౌరవ అధ్యక్షుడు దశరథ రామిరెడ్డి, సెక్రటరీ సోమయ్య, రెడ్ క్రాస్ సొసైటీ ఈ సీ మెంబర్ వేణుగోపాల్ మరియు వాకర్స్ ప్రతినిధులు బొద్దిరెడ్డి రాజిరెడ్డి, వీరస్వామి, కుమారస్వామి, యాదగిరి, రమణ రెడ్డి, తిరుపతి, సుధీర్ లు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *