కాంగ్రెస్‌ అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం

– జూబ్లీహిల్స్ ‌ప్రచారంలో ఎంపీ రఘునందన్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రజా దర్బార్‌ ‌ను నిర్వహిస్తాం అన్నారు.. అది నిర్వహించడానికే కాంగ్రెస్‌ ‌కు చేతకాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే కేసీఆర్‌ అవినీతి రూ. లక్ష కోట్లు కక్కిస్తాం అన్నారు.. ప్రజలకు పంచుతాం అన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌కుటుంబం నుంచి కక్కించిన మొత్తం డబ్బు ఎంతో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. జీ.ఓ. 111 వెనక లక్షల కోట్ల కుంభకోణం ఉందంటూ అది ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌ 30 ‌శాతం కమీషన్‌ ‌సర్కార్‌ అన్నారు. ప్రస్తుతం ఎంత కమీషన్‌ ‌నడుస్తుంది ముఖ్యమంత్రి చెప్పాలి అని నిలదీశారు. కాంగ్రెస్‌ అభయ హస్తం కాదు.. ఆది భస్మాసుర హస్తమని జూబ్లీహిల్స్ ‌ప్రజలు గమనించాలని రఘునందన్‌రావు కోరారు. మేనిఫెస్టోలో మొదటి పేజీనే అమలుకు నోచుకోలేదన్నారు. ఒక్క నియోజకవర్గంలో కూడా గుంట‌ జాగా స్మశానవాటిక కు ఇవ్వలేదన్నారు. కానీ షేక్‌పేట్‌లో కబ్రస్థాన్‌కు ఆగమేఘాల మీద భూమి ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీని కబ్రస్థాన్‌ లో పెట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కంటోన్మెంట్‌ అభివృద్ధికి రూ.4 వేల కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చెబుతున్నారని.. అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎంఐఎం ఎవరి కోసం ప్రచారం చేస్తోందో జూబ్లీహిల్స్ ‌ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *