హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. తెలంగాణలో ఏడబ్ల్యూఎస్‌కు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై ఆ బృందం చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్యమంత్రి వారికి స్పష్టం చేశారు. సీఎంతో జరిగిన సమావేశంలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





