special Stories

special Stories

బతుకమ్మ’ ధిక్కార స్వరం ‘టీ’ కప్పులో తుపాన్..!

బీఆర్ఎస్ పార్టీ చీలుతుందా అన్న చర్చ దగ్గరి నుంచి కేసీఆర్ తనయ కవిత కొత్త పార్టీ పెట్టేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టే స్థాయికి చేరాయి. ఏడాదిన్నరగా రేవంత్ ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలి , ప్రజలను ఎలా రెచ్చగొట్టాలి బీఆర్ఎస్ పై వచ్చిన నిందలకు ఎలా సమాధానం చెప్పాలి అనే ప్రయత్నంలో కేసీఆర్ నిమగ్నమై ఉంటే పిడుగులాంటి…

న్యాయవ్యవస్థపై నమ్మకమెట్లా కుదిరేది!?

 గత మార్చి నెలలో దిల్లీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసంలో భారీ స్థాయిలో కాలిపోయిన నోట్ల కట్టల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ దృశ్యాలన్నీ ప్రముఖ టీవీ ఛానళ్ల లో ప్రసారమవ్వడమే కాకుండా అన్ని పత్రికలు పతాక శీర్షికన ఆ వార్తను ప్రచురించడంతో న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై నీలి నీడలు కమ్ముకున్నాయని న్యాయనిపుణులు…

పౌర హక్కుల కోసం పరితపించిన మేధావి బాల గోపాల్

Bala Gopal, the intellectual who fought for civil rights

జూన్ 10… పౌర హక్కుల పోరాట యోధుని జయంతి పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత బాలగోపాల్ కే దక్కుతుంది. బాలగోపాల్ ఒక మధ్యతరగతి తెలుగు బ్రాహ్మణ దంపతుల ఎనిమిది మంది పిల్లలలో ఐదవ సంతానం- కందాళ్ళ పార్థనాథ శర్మ మరియు రాళ్ళపల్లి నాగమణి దంపతులకు బాలగోపాల్ 1952, జూన్ 10న బళ్ళారి, కర్ణాటకలో…

భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

 ఇది పరిమాణాత్మక మార్పు, మరి గుణాత్మక మార్పు గురించి ఏమిటి? అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం ఇటీవల 2025లోభారతదేశం అధికారికంగా జపాన్‌ను అధిగమించి 4.187 ట్రిలియన్ల అమెరికన్ డాలర్ల నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి (GDP)తో ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నీతి ఆయోగ్ (NITI AAYOG) ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO) బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం ఈ పరిణామాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, ప్రపంచ ఆర్థికవ్యవస్థ ర్యాంకింగ్స్‌లో ఇప్పుడు…

బాధ్యత మరిచిన మీడియా సంస్థలు

ఒక ప్రధాన జాతీయ పత్రిక “కరీనా కపూర్ రోజులో తన చివరి ఆహారం (లాస్ట్ మీల్) 6.30 గంటలకు ముగిస్తుందని, లాస్ట్ మీల్ తీసుకోవాల్సిన సమయం చాలా ముఖ్యం” అనే అర్ధం వచ్చేలా తన సోషల్ మీడియా హ్యాండిల్ లో కరీనా కపూర్ ఆహారపు అలవాట్ల గురించి పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు భారత మాజీ…

తెలంగాణ ఆశలు, నిరాశలు: రాజకీయాల పునరాలోచన

2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం పైన నిర్బంధం కొనసాగిస్తున్నప్పుడు పాడుకున్న పాట… “పాలన  ఏం పాలన ఫాసిస్టు పాలన..కాంగిరేసు పాలన కసాయి మూకల పాలన…” ఈ పాట ఇప్పుడు 2025లో మళ్ళీ అదే కాంగ్రెస్ సర్కారులో పాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పటికీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల్లో తేడా ఏమీదనేది స్పష్టంగా కనబడుతున్నది.  భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికరంలోకి వచ్చిన తరువాత దేశంలో ఫాసిస్టు పోకడలు,  మతోన్మాదం,  నిర్బంధం తీవ్రతరం అయ్యాయి. ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు పని చేసే పరిస్థితులు లేక కారు మబ్బులు కమ్ముకుని చీకట్లు ముసురుకుంటున్న సమయంలో బీజేపీని ఎదురుకోవడానికి మధ్యంతర మార్గంగా కాంగ్రెస్ పార్టీకి అనేకమంది ప్రజాసంఘాలు, హక్కుల సంఘాల నాయకులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, బుద్ధిజీవులు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దత్తు తెలిపి అధికారంలోకి రావడానికి కారణం అయ్యారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మానిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు, మానిఫెస్టోలో పెట్టని 7వ ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారంటీ, 420 హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాయి. సహజంగానే మనిషి ఆశాజీవి. కెసిఆర్ ప్రభుత్వంలో కన్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు మరింత ఎక్కువ లబ్ది జరుగుతుందనే…

శకలాలుగా ఉన్నాము, తిరిగి సకలజనులం కాగలమా?

మొన్న మే 31 న హైదరాబాద్‌ లో జరిగిన ఒక విశేషం గురించి చెప్పుకోవాలి. తెలంగాణ జర్నలిస్ట్స్‌ ఫోరమ్‌ (టిజెఎఫ్‌) ఇరవై నాలుగో ఆవిర్భావ దినోత్సవం- రజతోత్సవాల ప్రారంభం వేలాది మంది పాత్రికేయుల మధ్య ఉద్యమజ్ఞాపకాల ఉద్వేగంతో, ఒక పునస్సమాగమ ఉత్సాహంతో జరిగింది. అంతటి సందోహాన్ని చూసి నిర్వాహకులు, ప్రేక్షకశ్రోతలు అందరూ ఆశ్చర్యపోయారు. చాలా కాలం అయింది కదా, తెలంగాణ ఉద్యమాన్ని తలపోసుకుని! విద్యార్థి ఉద్యమ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, న్యాయవాద సంఘ నాయకులతో…

కేబినేట్ లో  ‌విజయశాంతికి చోటు?

హైదరాబాద్‌లో జోరుగా ప్రచారం ప్రచారంలో రాజగోపాల్‌ ‌రెడ్డి, వివేక్‌ల పేర్లు రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే విషయంలో అప్పుడూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌ప్రాంతానికి చోటు దక్కే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరుగనున్నదనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌నుంచి ఎమ్మెల్సీ విజయశాంతికి మంత్రి…

ఛత్తీస్‌ఘడ్‌లో ఎదురుకాల్పులు

ఐదుగురు మావోయిస్టులు మృతి ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని అటవీప్రాంతంలో కొన్నిరోజులుగా కాల్పుల మోత కొన‌సాగుతోంది. బీజాపుర్‌ ‌జిల్లాలోని నేషనల్‌ ‌పార్క్‌లో భద్రతా బలగాలు చేతిలో  మూడోరోజు ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.వారి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…

కేబినేట్‌ ‌విస్తరణకు హైక‌మాండ్ ఓకే!

‌- నేడు  ప్రమాణస్వీకారం – రాజ్‌భవన్‌లో ఏర్పాట్లకు ఆదేశాలు – ముగ్గురు లేదా నలుగురికి అవ‌కాశం – ఎవ‌రిక‌నేదానిపై కొన‌సాగుతున్న స‌స్పెన్స్ ‌తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై  కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్‌ ‌హైకమాండ్‌ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆదివారం తెలంగాణ కేబినెట్‌ ‌విస్తరణ జరుగనుందని సమాచారం.  మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి చోటు-…