special Stories

special Stories

ఆత్మాభిమానం మచ్చుకైనా లేదా?

special story on gaddar awards

తెలంగాణ ఆత్మాభిమానం నినాదంతోనే అంత పెద్ద ఉద్యమం సుదీర్ఘకాలం పాటు సాగిందనేది నిర్వివాదాంశం. చాలా కష్టపడి, ఎన్నోనష్టాలకోర్చీ, ఉద్యమాన్ని అణచివేసేందుకు చేసిన కుట్రలన్నింటిని తట్టుకుని నిలబడి, ఎందరెందరో యువకులు నిరాశలో కూరుకుపోయి ఆత్మబలిదానాలు చేయగా వచ్చిన తెలంగాణ ఇది. మళ్లీ ఆంధ్రోళ్ల చెప్పులు మోయిస్తున్నారా  నా తెలంగాణ తో. ఎంత బాధో ఇది, ఎంత ఉక్రోషమో…

ఆధునిక ఆరోగ్యానికి సహజ మార్గాలు యోగ ప్రకృతి వైద్యం 

world yoga day 2025

ఆధునిక ఆరోగ్య సవాళ్లను యోగా  ప్రకృతి వైద్యం సమగ్ర పరిష్కారాలుగా ఆవిర్భవించాయి. పెరుగుతున్న జీవనశైలి రుగ్మతలు,  మానసిక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో  యోగా,  ప్రకృతి వైద్యం వంటి సాంప్రదాయ ఆరోగ్య వ్యవస్థలు తిరిగి పుంజుకుంటున్నాయి. పురాతన భారతీయ తత్వశాస్త్రంలో పాతుకుపోయిన ఈ పద్ధతులు ఆరోగ్యం,  శ్రేయస్సుకు స్థిరమైన, దాడి చేయని విధానాలను అందిస్తాయని నిపుణులు…

అహంభావ సాహిత్యం

(అహ్మద్‌నగర్‌ జైలు నిర్బంధంలో ఉన్నపుడు మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ తన మిత్రుడు సదర్‌యార్‌ జంగ్‌ నవాబ్‌కు రాసిన లేఖ) అనువాదం : దేవులపల్లి మదన్‌ మోహన్‌ రావు -సేకరణ : వీణ మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ అహ్మద్‌ నగర్‌ కోట 1943, జనవరి 9 ప్రియ మిత్రమా! అహంభావ సాహిత్యాన్ని (జుస్త్రశీఱర్‌ఱష ూఱ్‌వతీa్‌బతీవ)…

చేతిలో ఎర్రజెండాను ఒడిసి పట్టుకొని

దిగువ మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టినప్పటికీ, పేదల ఆకలి కడుపుల కేకలు బాగా విన్నవారు. సమాజంలోని అజ్ఞానాన్ని, అశాస్త్రీయతను తొలగించాలని కొన్ని దశాబ్దాలుగా తన ఆలోచనలతో, అక్షరాలతో అనునిత్యం పోరాటం చేస్తున్నవారు. అన్నింటికీ మించి శ్రామికులు, కార్మికులు, కర్షకులు, చిరుద్యోగులకి ఆప్తులు పతివాడ నాస్తిక్‌. సమసమాజం కోసం ఆయన కంటున్న కలలు, కోరుకున్న మార్పు ఆయన కవిత్వం…

జయ్య్‌!

‘భారత్‌ మాతాకీ జయ్య్‌!’ పెద్దగా అరిచాడు. అలా అరిచినప్పుడు అతని కంఠనాళాలే కాదు, కంఠం కూడా వుబ్బింది. కళ్ళు యెర్రబడ్డాయి. కరుచుకున్న పల్లు టకటకలాడాయి. ముఖమయితే బాగా పిడిచి ఆరబెట్టిన బట్టలా యెక్కడికక్కడ వుగ్గులు పడిరది. రోడ్డుమీద గుడ్డలు చించుకున్న అతణ్ణి చూసి ‘దేశభక్తుడు’ అన్నారు కొందరు. ‘తెలంగాణ మాతాకీ జయ్య్‌!’ మళ్ళీ అరిచాడు. పిడికిలి…

ఒక నువ్వు

పొద్దున వాకిట్లో పువ్వు తెల్లగా నవ్వితే నువు గుర్తొస్తావు తలుపు తీసినప్పుడు అదాటున పిల్లతెమ్మెర తోసుకొస్తే నువు గుర్తొస్తావు అమ్మ భుజం మీద వెనుతిరిగి పాప చేతులూపినపుడు నువు గుర్తొస్తావు వానాకాలం చినుకుల్లో వెచ్చని అరచేతుల తేనీటి ఆవిరుల మధ్య నువ్వు గుర్తొస్తావు ఎవరూ లేని రోడ్డు మీద ఒక్కణ్ణీ నడచి వెళుతున్నప్పుడు నువు గుర్తొస్తావు…

కొత్తాకులు తొడిగి

రేపో ఎల్లుండో లేదా మరికొన్ని స్వల్పకాలపు దినాల్లోనో మన ప్రయాణం ముగిసిపోవచ్చు కానీ మన దారిలోని గాలిపాట చెట్ల సంగీతం నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి మన జ్ఞాపకాలు అంతే ప్రయాణపు హడావిడిలో వేగిరపు జీవితం దారిలో ఎన్నెన్నిటినో చూడకుండానే జీవితంలోకి ఒంపుకోకుండానే వదిలేసామో కదా తొలి జోరువానకే పరుగులు పెడుతున్న జీడివాగును చూశావా అడుగులేయడం నేర్చుకున్న…

బ‌డుల దుస్థితి గుర్తించ‌కుండా ఒప్పందాలు నిష్ప్ర‌యోజ‌నం

స్వచ్ఛంద సంస్థలు (ఎన్‌జీఓలు) మరియు ప్రభుత్వాల పాత్రలు వేరు వేరుగా ఉంటాయి.  ప్రభుత్వాల  విధానాలు, మౌలిక సదుపాయాలు మరియు విస్తృత స్థాయి సంక్షేమ కార్యక్రమాలకు బాధ్యత వహిస్తాయి. ఇక ఎన్‌జీఓలు ప్రత్యేక సమస్యలపై దృష్టి పెట్టి, స్థానిక స్థాయిలో సేవలందించడంతో పాటు  పౌరుల రాజ్యాంగ బద్ద  హక్కుల గురించి  ప్రభుత్వాల దృష్టికి తీసుకెళుతుంటాయి. హక్కుల సాధనకు…

ప్రజల ప్రదర్శన అంటే ఏలినవారికి ఎందుకింత భయం?!

ప్రభుత్వం ఎక్కువా? ప్రజలు ఎక్కువా? ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రభుత్వం, ప్రజలు వోట్లు వేసి ఎన్నుకుంటే మాత్రమే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో భాగమైన అధికారవర్గం ప్రజల దయ వల్ల అక్కడ ఉన్నామనే విషయాన్ని మరిచిపోతున్నారా?  ప్రభుత్వోద్యోగి, ప్రభుత్వాధికారి అనే మాటలు ఇటీవలివి గాని, అంతకు ముందు వాళ్లను పబ్లిక్…

‘‘సంపాదకీయాల’’ సంకలన సంపాదకుడు ఇందుర్తి ప్రభాకర్

11. జనధర్మోవిజయతే   10. జనధర్మోవిజయతే  ప్రజాతంత్ర దిన పత్రికలో ఎం ఎస్ ఆచార్యగారి జీవన సమరం గురించి జనధర్మో విజయతే పేరుతో రియల్ గా వస్తున్న వ్యాసాలలో ఇది నెంబర్ 11. ఆచార్యగారి షష్టి పూర్తి అభినందన సంచిక, సంపాదకీయా ఎడిట్ చేసిన సందర్భంలో రచించిన వ్యాసంలో ఒక భాగం ఇది. ఇందులో వ్యక్తిగా సమాన్యత్వం,…