మెరుపు తీగెలు అదృశ్యులు!

ఎప్పుడూ అద్దంలో ముఖం చూసుకోవడమే అలవాటు. కాని యీ మధ్య స్టీల్ ప్లేట్లో ముఖం చూసుకుంటున్నా. అదీ భోజనానికి కూర్చున్నప్పుడు. వడ్డించడానికి ముందు. ఈ విషయం మా ఆవిడ కనిపెట్టినట్టే వుంది. “దువ్వెన తెచ్చి యివ్వనా?” అడిగింది. నేను నవ్వలేదు. ‘ఉన్నవి నాలుగు వెంట్రుకలు గాని, వో యిదైపోతారు’ గొణుగుతూ వడ్డించబోతున్న మా…









