prajatantra_news

prajatantra_news

కేర్‌ హాస్పిటల్స్‌లో అరుదైన హార్ట్‌ సర్జరీ

– విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24: మలక్‌పేటలోని కేర్‌ హాస్పిటల్స్‌ వైద్యులు నల్గొండకు చెందిన 30 కిలోల బరువు మాత్రమే ఉన్న 29 ఏళ్ల మహిళకు మిట్రల్‌ వాల్వ్‌ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇది చాలా క్లిష్టమైన హార్ట్‌ సర్జరీగా పరిగణిస్తారు. శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ పథకం ద్వారా జరగగా…

కనీస వేతన బోర్డు చైర్మన్ గా జనక్ ప్రసాద్ నియామకంపై వివరణ ఇవ్వండి

~రాష్ట్రానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: కనీస వేతనాల బోర్డు చైర్మన్‌గా జనక్‌ప్రసాద్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటీషన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ , బోర్డు సభ్యుడు నరసింహారెడ్డి లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. జనక్ ప్రసాద్ నియామకంపై వివరణివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు…

జర్నలిస్టుల సమస్యలను విస్మరించం

– వచ్చే వారంలో నూతన అక్రిడిటేషన్‌ విధివిధానాలపై చర్చిద్దాం – ఇండ్ల స్థలాల జారీ ప్రక్రియ కోర్టు పరిధిలోని అంశం – టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా మహాసభలో మంత్రి పొంగులేటి  వైరా, ప్రజాతంత్ర, జులై 24: ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడటంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకం.. 18 నెలలుగా ప్రజాపాలన సజావుగా సాగడంలో వారి సహకారం ఎంతో…

ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సంక్షేమం

– మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 24: ఇందిరమ్మ ప్రభుత్వం పేదల జీవితాల్లో మార్పు కోసం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని 59, 60 డివిజన్లలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం దానవాయిగూడెంలోని కార్తికేయ ఫంక్షన్‌ హాల్‌లో…

కేటీఆర్‌కు కేసీఆర్‌ దీవెనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: తన పుట్టిన రోజు సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తన తండ్రి, పార్టీ అధినేత కల్వకుర్తి చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, పుత్రుడు హిమాన్షును తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్‌ తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా తన పుత్రుడిని ఆలింగనం చేసుకున్న…

అందోల్‌లో మంత్రి దామోదర పర్యటన

– పలు నిర్మాణ పనుల పరిశీలన అందోల్‌, ప్రజాతంత్ర, జులై 24: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆందోల్‌ నియోజకవర్గంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా చౌటుకూరు మండల కేంద్రంలో ఓ హోటల్‌లో స్థానిక నాయకులతో మాట్లాడారు. హోటల్‌లో ఆకస్మిక తనిఖీ చేసి వంటకాలను పరిశీలించారు. ఫుడ్‌ సేఫ్టీ నిబంధలను పాటించాలని…

ఒక్క పథకం విప్లవాత్మక మార్పులకు కారణమైంది

మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్‌ పోస్టు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: ఆర్టీసీలో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ పథకం వారికి ఆర్థిక భారం తగ్గించేందుకు, ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ’ఎక్స్‌‘లో పోస్టు పెట్టారు. ఒక సంక్షేమ పథకం అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైందని పేర్కొన్నారు. కొందరు ఎగతాళి చేసినప్పటికీ ఈ…

మా లక్ష్య సాధనలో పాలుపంచుకోండి

– పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణలో అపార అవకాశాలు – యూఏఈ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని యూఏఈ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.…

మరో ఘోర ప్రమాదం

కూలిన రష్యా ప్యాసింజర్‌ విమానం ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌ : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం మరిచిపోకముందే చైనా సరిహద్దులో రష్యన్‌కు చెందిన విమాన ప్రమాదం మరొకటి చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రష్యన్‌ ప్యాసింజర్‌ విమానం ఏఎన్‌-24 చైనా సరిహద్దుల్లోని అముర్‌ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో 43మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు…

ప్రజాప్రతినిధుల కోర్టుకు సీతక్క హాజరు

– కోవిడ్‌ కాలంలో నిరసనలపై కేసుల్లో.. – ఆగస్టు 13కు విచారణ వాయిదా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 24: కోవిడ్‌ కాలంలో నిరసనకు సంబంధించి నమోదైన కేసులో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్కనాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. రూ.10 వేలతో రెండు షూరిటీలు కోర్టులో దాఖలు చేయగా…