prajatantra_news

prajatantra_news

ప్రజలను అపమత్తం చేయండి

– కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి సీతక్క ఆదేశాలు – భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించిన మంత్రి ములుగు, ప్రజాతంత్ర, జులై 23: భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద పరిస్థితిపై ప్రజలను అప్రమత్తం చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి…

ట్రంప్‌ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి

ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే న్యూదిల్లీ, జులై 21: వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగా లోక్‌సభ, రాజ్యసభలలో చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై కీలక ప్రశ్నలు వేశారు. ఇటీవలి భారత్‌-పాకిస్తాన్‌ సంఘర్షణ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన శాంతి ఒప్పందం వాదనలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.…

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ కన్నుమూత

తిరువనంతపురం, జులై 21: కమ్యూనిస్ట్‌ పార్టీ సీనియర్‌ నేత, కేరళ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీఎస్‌ అచ్యుతానందన్‌ (101) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందారు. గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు ఆయన్ని తరలించారు. చికిత్సపొందుతూ తుది…

ముచ్చర్ల సత్తన్న పంచాయతీ పాట ఆవిష్కరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 21: గ్రామాల్లో సర్పంచ్‌ లేకపోవటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాల్లో సర్పంచ్‌లతో ఉన్న ఉపయోగాలు తనకు తెలుసునని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. సర్పంచ్‌ల గొప్పతనంపై ముచ్చర్ల సత్యనారాయణ ఎప్పుడో పాట రాయడం చాలా గొప్ప విషయమంటూ ఆ పాటను గాత్ర రూపంలో…

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ రాజీనామా

Jagdeep Dhankhar

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా   వైద్య పరమైన కారణాలతోనేని వెల్లడి హైదరాబాద్​, ప్రజాతంత్ర, జూలై 21 : పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ( Jagdeep Dhankhar ) తన పదవికి రాజీనామా చేశారు. వైద్య పరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ…

మెదడును కాపాడుకోండి

– వరల్డ్ ‌బ్రెయిన్‌ ‌డే హైదరాబాద్‌, ‌ప్రజా తంత్ర, జూలై 21 : మన శరీరాన్ని నియం త్రించే అత్య ంత ముఖ్యమైన అవ య వం మెదడు. ఆలోచ నలు, కదలికలు, భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి – ఇవన్నీ దీని ఆధీనంలో ఉంటాయి. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలపై అందరూ శ్రద్ధ చూపుతారు కానీ మెదడు…

పార్లమెంట్‌లో వ్యూహంపై మోదీ చర్చలు

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై21:  పార్లమెంటు సమావేశాల్లో తొలిరోజు గందరగోళ పరిస్థితి నెలకొంది. పహల్గాం దాడి, ఆపరేషన్‌ ‌సింధూర్‌, అహ్మదాబాద్‌ ‌విమాన ప్రమాదాలపై మోడీ స్పందించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంట్‌ ‌హౌస్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జెపి నడ్డా, ఆర్థికమంత్రి నిర్మలా…

రాజకీయ పోరాటాల్లోకి ఈడీని ఎందుకు లాగుతారు

– “ముడా” కేసులో ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం – కేసును కొట్టివేస్తూ తీర్పు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూలై 21: ‌కర్ణాటకలోని రూ.వందల కోట్ల విలువైన మైసూరు అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ కుంభకోణానికి సంబంధించి.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి సమన్లు జారీ చేయడాన్ని క్వాష్‌…

24న మంచుకొండ లిఫ్ట్‌ ట్రయల్‌రన్‌

– నేషనల్‌ హైవే ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు మార్చాలి – ఖమ్మం నగరంలో రహదారుల విస్తరణ చేపట్టాలి – ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి ఖమ్మం టౌన్‌, ప్రజాతంత్ర, జులై 21: మంచుకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ట్రయల్‌ రన్‌ను ఈనెల 24న నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరిగేషన్‌ అధికారులను…

వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా వుండాలి

– ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లగ‌కూడ‌దు – హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలి – యూరియా కొర‌త లేదు – గిరిజ‌న ప్రాంతాల్లో అంటువ్యాధుల‌పై జాగ్ర‌త్త‌లు – 24 నుంచి కొత్త రేష‌న్ కార్డులు – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 21:  భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా…