prajatantra_news

prajatantra_news

చెప్పేది విన‌కుండా వెళ్లిపోతే ఎలా?

– పేదల సంక్షేమంపై వివరిస్తుంటే పట్టదా? – బీఆర్ఎస్ సభ్యులపై డిప్యూటీ సీఎం ఫైర్ – ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎన్ని కోట్లయినా ఇస్తాం – వారం వారం బిల్లుల చెల్లించడానికి సిద్ధం అన్న భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: పేదల సంక్షేమం గురించి అసెంబ్లీలో వివరిస్తుంటే వినడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులకు మనసు…

2-బిహెచ్ కే కేటాయింపులు పూర్తి చేస్తాం

– 99 రోజుల ప్రణాళికలో పట్టణాల్లో ఇండ్లకు కార్యాచరణ – త్వరలో 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు – జూన్ నాటికి మరో లక్ష  పూర్తి – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో…

అవన్నీ వదంతులే

– రాష్ట్రంలో సరిపడ ఇంధన నిల్వలు – కొరత అంటూ ఆందోళన చెందనవసరం లేదు – ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

ఎంఐఎంపై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

– వందేమాతరం ఆలపిస్తుండగా వెళ్లిపోవ‌డంపై హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ఉభ‌య స‌భ‌ల‌నుద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగించిన సంద‌ర్భంలో జాతీయ గీతం వందేమాతరం ఆలాపన జరుగుతుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేయడంపై రాష్ట్ర గవర్నర్‌కు బీజేపీ  ఫిర్యాదు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కోశాధికారి…

ఎందుకీ ‘వివక్ష’ వ్యాఖ్యలు?

– సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమేమీ ఉండదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తే మీకొచ్చిన నష్టమేంటి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దక్షిణాదిపై…

ఇంధన కొరత.. అసత్యం

– తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ఇంధన కొరత ఉందనేది అసత్యమని, ఈ వదంతులను ప్రజలు నమ్మి అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారని  తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని…

స్పీకర్‌ను డిక్టేట్ చేయొద్దు

– బీఆర్ఎస్ సభ్యులకు మంత్రి దుద్దిళ్ల హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: సభను ఎలా నడపాలో స్పీకర్‌ను డిక్టేట్ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు చూడటం మంచి పద్ధతి కాదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హితవు పలికారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు బుల్డోజ్ చేశారు.. ఇప్పుడూ అలాగే చేయాలనుకుంటే ఎలా అని…

వికలాంగులు, వితంతుల పెన్షన్లు పెంచలేదు

– బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న బీజేపీ గత పదేళ్లుగా వికలాంగులు, వితంతుల పెన్షన్లు పెంచలేదని, వ్యవసాయంపై నల్ల చట్టాలు తెస్తే రాహుల్ గాంధీ పోరాటంతో వెనక్కి తీసుకున్నారని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విమర్వించారు. 16…

అభివృద్ధిలో డీఎంఎఫ్‌ల పాత్ర కీలకం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24: నీతి ఆయోగ్, భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, రాష్ట్రాలు కలిసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్)లను మరింత బలోపేతం చేసేందుకు సహకార సమాఖ్య స్ఫూర్తిగా కలిసికట్టుగా పనిచేస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెండు…

అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ‌పథకంతో 2వేల మందికి లబ్ది

– అసెంబ్లీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: విదేశీ విద్య ఉపకార వేతనాల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ‌పథకం ద్వారా సుమారు 2వేల మంది విద్యార్థులకు విదేశీ విద్య ద్వారా ఉపకార…