prajatantra_news

prajatantra_news

యువతలో నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి శిక్షణ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఉచిత స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ తెలియజేశారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన లేదా…

ప్రజాస్వామ్య పద్ధతిలో మూసీ పునరుజ్జీవం

– 15 రోజులపాటు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం – విలువైన సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ భేటీ – మూసీ సబ్ కమిటీ సభ్యులు 24/7 అందుబాటులో – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: మూసీ పునరుజ్జీవ పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసీ…

గ్రామ సభలు ప్రజల స్వరం ప్రతిబింబించే వేదికలు

– 2నుంచి వాటి నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయండి – జిల్లాల అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను…

భార్యాపిల్లలను రోకలితో మోదిన తాగుబోతు

– భార్య, కుమారుడి మృతి – ప్రాణాపాయ స్థితిలో కూతురు ప్రణీత ఆమనగల్లు, ప్రజాతంత్ర, మార్చి 31 : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధి పులిగోనిపల్లి తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మద్యం మత్తులో ఉన్న సభావట్ రాందాస్ అనే వ్యక్తి తన భార్య కవిత(29), కుమారుడు హర్షవర్ధన్(5), కూతురు…

మంత్రులంద‌రం నిబ‌ద్ధ‌త‌తో పనిచేస్తున్నాం

– రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు – నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం – పాత బస్తీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, – దేశానికి ఆదర్శంగా మెట్రో వ్యవస్థ – రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చూస్తాం – రిటైర్మెంట్ ఉద్యోగులు బాధపడొద్దు – ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో డిప్యూటీ సీఎం హైదరాబాద్,…

ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపణలు అవాస్తవం

– రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తమ కంపెనీ కార్యకలాపాలపై ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన ఆరోపణలను తాము ఖండిస్తున్నామని రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ తెలిపింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇప్పటివరకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ నుండి ఎలాంటి నోటీసులు తమ కార్యాలయానికి గానీ, తమ…

కాళేశ్వరంతో లక్షకోట్లు ప్రజాధనం వృధా

– రాజ్యసభలో కేంద్ర మంత్రి పాటిల్‌ ‌వ్యాఖ్యలు న్యూదిల్లీ, మార్చి 30: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌ ‌శక్తి మంత్రి సి.ఆర్‌.‌పాటిల్‌ ‌సోమవారం రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారని మండిపడ్డారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్‌, ‌డిజైన్‌ ‌లోపాలే కారణమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ…

ఆయుధాలు వీడి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో చేరండి

– అజ్ఞాత మావోయిస్టుల‌కు డీజీపీ పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: అజ్ఞాతంలో ఉన్న సిపిఐ (మావోయిస్టు) పార్టీ నాయకులు, కేడర్ వెంటనే హింస మార్గాన్ని విడిచిపెట్టి, ఆయుధాలు సమర్పించి ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలోకి చేరి సురక్షితమైన, గౌరవప్రదమైన, అర్థవంతమైన జీవితం గడపాలని డీజీపీ శివ‌థ‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గతంలో ఇచ్చిన పిలుపు…

అంతమా?.. ఆరంభమా??

– ఆరు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరుకుందా? – హసేవ్ సెగలు.. కార్పొరేట్ నీడల మాటున నిప్పు రాజుకుంటుందా? – కొత్త పంథాలో పోరాటానికి ఊపిరి పోస్తారా? – అమిత్ షా ‘మావోయిస్టు ముక్త్ భారత్’ ప్రకటన నేపథ్యంలో ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం              …

కాగ్ నివేదికతో కళ్లు తెరవండి

– కాంగ్రెస్ పాలనలో గాడితప్పిన ఆర్థిక క్రమశిక్షణ – ప్రభుత్వాన్ని కడిగి పారేసిన కాగ్ – అవాస్తవిక బడ్జెట్ అన్నది సుస్పష్టం – అప్పులు తెచ్చినా ఆస్తులు పెంచలేదు – రాష్ట్ర పరపతిని దెబ్బతీయొద్దు – బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక…