deccan.com

deccan.com

‘ఉత్తమ వోటరు అవగాహన’ ప్రచార అవార్డుకు నామినేషన్ల ఆహ్వానం

జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఇలంబర్తి వోటు హక్కు వినియోగించుకోవడంపై 2024 సంవత్సరంలో వోటర్లకు అవగాహన పెంపొందించి చైతన్య పరచడానికి కృషి చేసిన ఉత్తమ ప్రచారానికి సంబంధించి, భారత ఎన్నికల సంఘం మీడియా అవార్డులను ప్రకటించింది హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌ప్రజాస్వామ్యంలో వోటు విలువ, వోటు హక్కు వినియోగించుకోవడం పై 2024 సంవత్సరంలో వోటర్లకు అవగాహన పెంపొందించి…

‘‌నాపై ట్రోల్‌ ‌చేస్తే బట్టలూడదీసి కొడతా’

కేటీఆర్‌, ‌హరీష్‌రావుకు మతిభ్రమించింది రేవంత్‌ ‌చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు.. నేను, రేవంత్‌ ‌ఫైటర్స్… ‌బిఆర్‌ఎస్‌కు జగ్గారెడ్డి మరోసారి మాస్‌ ‌వార్నింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌తనపై సోషల్‌ ‌మీడియాలో ట్రోల్‌ ‌చేసేటోడు దొరికితే ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో బట్టలూడదీసి కొడతానని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌…

స్కిల్స్ ‌యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ ‌యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్‌ ఇ‌న్ఫ్రాస్ట్రక్చర్‌ ‌లిమిటెడ్‌ ‌ముందుకొచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్‌ ‌నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్‌ ‌సోషల్‌ ‌రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది.వీటితో యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ ‌యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనుంది. ఇదే విషయమై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి తో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌ ‌బాబు, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ఈ ‌సమావేశంలో పాల్గొన్నారు. కాగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్కిల్స్ ‌యూనివర్సిటీ క్యాంపస్‌ ‌ను నిర్మిస్తామని మెఘా కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్‌ ‌శివారు ప్రాంతమైన కందుకూరు మండలం మీర్‌ ‌ఖాన్‌ ‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే సీఎం రేవంత్‌ ‌రెడ్డి భూమిపూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా క్యాంపస్‌ ‌నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్యాంపస్‌ ‌నిర్మాణానికి ముందుకు వొచ్చిన మెఘా కంపెనీకి సీఎం రేవంత్‌ ‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ ‌నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌సూచించారు. నవంబర్‌ 8‌వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

 ‘మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు •రాష్ట్ర  ప్రభుత్వంతో ఎంవోయూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్యాంపస్‌.. •వొచ్చే నెలలోనే నిర్మాణ పనుల ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ ‌యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్‌…

ఇంటి వద్దకే టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో సేవలు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,అక్టోబర్‌26:రాష్ట్ర ప్రజలకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక నుంచి ఇంటి వద్దకే నేరుగా టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో సేవలను అందించనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ వెల్లడిరచారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్‌(కార్గో) సేవలను మరింతగా విస్తరిస్తున్నామని  మంత్రి పొన్నం తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్‌లో…

పేదల అసైన్డ్ ‌భూములను లాక్కోవొద్దు

దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల ఆందోళన.. అండగా నిలిచిన ఎంపీ ఈటల రాజేందర్‌. అధికారులపై ఫైర్‌ ‌మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, ప్రజాతంత్ర,అక్టోబర్‌ 26: అసైన్డ్ ‌భూములను ఇష్టం వొచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికీ లేదని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల లబ్దిదారులు శనివారం ఆందోళన చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన ఎంపీ…

జర్నలిస్ట్ అ‌క్రిడిటేషన్‌ ‌కార్డుల మంజూరుపై కసరత్తు

విధివిధానాలపై ప్రత్యేక కమిటీ చర్చ జర్నలిస్టుల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టో బర్‌ 26 : ‌రాష్ట్రంలోని వర్కింగ్‌ ‌జర్నలిస్టులకు అక్రిడి టేషన్‌  ‌కా ర్డుల మంజూ రుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శ కాల ను రూపొం దించడానికి తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ…

పోలీసుల ఆందోళనల వెనక కుట్ర!

పోలీసు ఉన్నతాధికారుల అనుమానం ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన రాష్ట్ర డిజిపి జితేందర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, అక్టోబర్‌26: ‌తెలంగాణ పోలీస్‌ ‌బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై పోలీస్‌ ‌శాఖ గుర్రుగా ఉంది.  విధులను బహిష్కరించడం, రోడ్ల పైకి వచ్చి ఖాకీలే ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా పోలీస్‌ ‌శాఖ భావిస్తోంది. ఈ…

రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్ల ఆందోళనలు

ప్రత్యక్ష నిరసనల్లో కుటుంబాలతో సహా పోలీసులు వరంగల్‌, ‌నల్లగొండ జిల్లాల్లో రోడ్డెక్కిన ఖాకీలు ఇబ్రహీంపట్నం, మంచిర్యాలలో ఫ్యామిలీల ధర్నా ఆందోళనలతో మిన్నంటుతున్న బెటాలియన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌రాష్ట్రంలో ఏక్‌ ‌పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించాల్సిన పోలీసులే ఏకంగా రోడ్డెక్కుతున్నారు. వరంగల్‌ ‌జిల్లా మమూనూరు…

కొడంగల్‌ ‌నుంచే రేవంత్‌ ‌పతనం

BRS working president KTR said that the rebellion has started

కాంగ్రెస్‌ ‌నేతలు పలువురు బిఆర్‌ఎస్‌లో చేరిక తిరుగుబాటు మొదలైందన్న బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సొంత ఇలాఖాలో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది రేవంత్‌ ‌రెడ్డి కొడంగల్‌ ‌నియోజకవర్గం పర్యటనలో ఉండగానే.. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎంకు షాకిచ్చారు. పలువురు కాంగ్రెస్‌ ‌నాయకులు బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.…

ఇం‌దిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26: ‌రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ ‌ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని , రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా…