NEWS

NEWS

యోగాతో ఆరోగ్యం… ఆనందం : మంత్రి హరీష్ రావు సంకల్పం.. సిద్దిపేటలో వినూత్న యోగా కార్యక్రమం

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 23: ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఆనందం వెళ్లి విరిస్తుంది , ఆనందం ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి వికసిస్తుంది.అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడ మంత్రి హరీష్ రావు ముద్ర ఉంటుంది. ఆరోగ్యం అంటే ఆసుపత్రులు, డాక్టర్లు మాత్రమే కాదని ప్రజలు అనారోగ్యాలకు దూరంగా ఆనందంగా ఉండడమేనని రాష్ట్ర మంత్రి హరీష్…

డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి : ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, పీసీసీ డెలిగేట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ పోస్టర్ ను ఆవిష్కరణ వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 23: డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. స్వయం ఉపాధి కోసం డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నవారు ఎన్నో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, పీసీసీ డెలిగేట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి…

భద్రాచలం వద్ద మళ్ళీ క్రమంగా పెరుగుతున్న గోదావరి

శనివారం సాయంత్రానికి 41 అడుగులు….మరింత పెరిగే అవకాశం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 22 : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం శనివారం ఉదయం తగ్గినట్టు కనిపించినా సాయంత్రం నుంచి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. మధ్యాహ్నానానికి 39.7 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 41 అడుగులకు పెరిగింది. ఇది క్రమంగా ఆదివారానికి ఇంకాస్త పెరిగే అవకాశం…

తంతుగా మారిన పార్లమెంట్‌ ‌సమావేశాలు

ప్రజా సమస్యలపై కానరాని ఆరోగ్యకర చర్చలు వాద, ప్రతివాదనలకు…వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతున్న ప్రతినిధులు విలువలకు, సత్సంప్రదాయాలకు తిలోదకాలు ప్రజా ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకే ఆయా పార్టీల ప్రాధాన్యం వి. రామ్‌మోహన్‌ ‌రావు, ప్రజాతంత్ర ప్రతినిధి: హైదరాబాద్‌, ‌జూలై 22 : గత మూడు, నాలుగు టర్మ్‌లకు సంబంధించి ముఖ్యంగా 2009 తర్వాత జరుగుతున్న పార్లమెంట్‌…

20 ‌మంగళవారాల్లో 1.85లక్షల మందికి స్క్రీనింగ్‌

మహిళల ప్రత్యేక క్లినిక్స్ ‘ఆరోగ్య మహిళ’కు విశేష స్పందన సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై 22: మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రారంభించిన ‘‘ఆరోగ్య మహిళ’’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే లక్షణాల ఆధారంగా వ్యాధులు గుర్తించి, అవసరమైన వైద్యం…

వికర్ణు ని హితోక్తి

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి నువ్వు ఏకవస్త్రవైనా, రజస్వలవైనా, దిగంబరంగా ఉన్నా పరవాలేదు. నీవు మా దాసివి అంటూ లాక్కు వస్తుంటే, ద్రౌపది దీనాతిదీనంగా ఏడుస్తూ సభికులనుద్దేశించి, ఈ సదస్సులో నున్న రక్షించే వారు ఒక్కరూ లేరా? ఒక ఆడదానిపై అత్యాచారం జరుగుతూవుంటే భీష్మ, ద్రోణ, విదుర, ధృతరాష్ట్రాదులు ఏమి చేయలేని దుస్థితిలో వున్నారా?…

పుతిన్‌ దురాక్రమణ దాహానికి 500 రోజులు దాటింది..!

రష్యా‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించిన “ప్రత్యేక మిలటరీ ఆపరేషన్” పేరున‌ ఫిబ్రవరి 24, 2023న ఉక్రెయిన్‌పై అమానుష దాడితో మొదలై నాటో సహాయసహకార ప్రవేశంతో గత 500 రోజులుగా కొనసాగడంతో ప్రపంచ దేశాలన్నీ యుద్ధ ప్రభావంతో ఉత్పత్తి, సరఫరా గొలుసులు తెగిపోవడంతో ఆర్థికంగా 1.6 లక్షల కోట్ల డాలర్లకు పైగా కుంగిపోవడం, మరో లక్ష…

మహిళలే ఎందుకు లక్ష్యం ?

గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో ఉద్రిక్తలు పెరిగిపోతున్నప్పటికినీ, భారతదేశమంతా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండిపోయింది. మే 3, 2023న మొదటిసారిగా అక్కడ అల్లర్లు ప్రారంభమైతే స్పందించని దేశం జూలై 19, 2023న ఒక్కసారిగా తన మొద్దు నిద్ర నుండి బయటపడింది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరేగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నట్లు చూపించే ఒక భయంకరమైన…

వరదల వలన తీవ్ర నష్టాలు

మానవ మనుగడకు ప్రకృతి చేసే సవాళ్ళల్లో వరదలు ఒకటి.వివిధ రీతుల్లో ముంచుకొచ్చే వరదల కారణంగా భూమండలంపై ఎన్నో ప్రాంతాలు తల్లడి ల్లుతున్నవి.వరదల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, పర్యవరణంగా నష్టపోతున్నారు.సూర్యుడి నుంచి భూమి గ్రహించే ఉష్ణోగ్రత వల్ల భూమి వేడెక్కి నేల మీద ఉన్న తేమ, జలాశయాలు, నదులు, చెరువుల్లోని నీరు…

యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్‌

ప్రణాళికను రూపొందిస్తున్న రైల్వే అధికారులు యాదాద్రి వరకూ రెండవ లైన్‌ ‌పొడిగింపు రెండవ లైన్‌ ‌పనులను సమీక్షించిన అధికారుల బృందం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్‌ ‌న్యూస్‌. ‌ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్‌ ‌ట్రైన్‌ ‌సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్‌ ‌సేవలకు…