NEWS

NEWS

గ్రెగేరియన్‌ కేలండర్‌ అమలుకు నోచుకున్నదెప్పుడో తెలుసా?

నేడు గ్రెగేరియన్‌ కేలండర్‌ మొదలైన రోజు… ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న గ్రెగేరియన్‌ కేలండర్‌ ఎప్పుడు రూప కల్పన చేయబడి అమలుకు నోచుకున్నదో తెలుసా? క్రీస్తు శకం 1582 ఫిబ్రవరి 24వ తేదీన.  నేపుల్సుకు చెందిన అలోయిసియస్‌ లిలియస్‌ అనే వైద్యుడు జూలియన్‌ కాలెండరుకు చేసిన సవరణల ఫలితమే నూతన గ్రెగేరియన్‌ కేలండర్‌. దీన్ని పోప్‌…

పరీక్షలు ధీమాగా రాయాలి..

ఒత్తిడి జయిస్తేనే పరీక్షలలో రాణిస్తారువార్షిక పరీక్షల్కెనా, ప్రవేశపరీక్షల్కెనా దగ్గరపడుతున్నాయంటే విద్యార్థులలో భయంతో కూడిన కొంత ఆందోళన మామూలే. ఇది కాస్తా ఎక్కువయితే ఒత్తిడి పెరిగిపోయి పరీక్షలలో వచ్చిన సమాధానాలను కూడా రాయలేని పరిస్థితి ఎదురవుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితిని జయించటం సాధ్యమే. కళాశాలలో, తరగతిలో చురుగ్గా ఉండే విద్యార్థులు చాలా మంది ఉంటారు.…

నిఖార్సయిన ఉద్యమకారుడు నల్లెల్ల రాజయ్య!

ఫిబ్రవరి15, ఉదయం 8: 20 నిమిషాల ప్రాంతంలో ఒక ఫోన్‌ కాల్‌ విషాద వార్తను మోసుకొచ్చింది. ప్రజా గొంతుక, శ్రామిక పక్షపాతి, నిత్య శ్రామికుడు , ప్రజా కవి, రచయిత అయిన నల్లెల రాజయ్య సారు ఇక లేరు అన్నది ఆ దుర్వార్త సారాంశం! హృదయాన్ని ఎక్కడో కోస్తున్నట్టుగా అనిపించింది. నాలో ఏదో తెలియని ఆందోళన.భూమిపై…

శిగమూగిన వనం

జనసంద్రంగా మారిన మేడారం గద్దెలపై కొలువు దీరిన వనదేవతలు తల్లుల దర్శనాల కోసం లక్షలాదిగా తలివస్తున్న భక్తులు శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలతో మార్మోగుతున్న జాతర సమ్మక్కను దర్శించుకున్న గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, ముఖ్యమంత్రి రేవంత్‌, మంత్రులు, భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ నేడు అమ్మవార్ల వన…

మల్లు రవి సంచలన నిర్ణయం

దిల్లీలో ప్రభుత్వ ప్రతినిధికి రాజీనామా హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి23: టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లురవి  సంచలన నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎం రేవంత్‌ రెడ్డికి మల్లురవి పంపించారు. తన రాజీనామాను ఆమోదిస్తారా లేక ఆమోదించకుండానే నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటిస్తారా…

వనదేవతలను దర్శించుకోవడం సంతోషకరం

ఆదివాసి, గిరిజనులకు ప్రత్యేక శుభాకాంక్షలు : గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కేంద్ర గిరిజన మంత్రితో కలిసి  మహా జాతరలో పాల్గొన్న  రాష్ట్ర గవర్నర్‌ దంపతులు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : గిరిజన కుంభమేలా మేడారం మహా జాతరలో గవర్నర్‌గా  మూడోసారి పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు.…

కేసీఆర్‌ పాపాల ఫలితంగానే బీఆర్‌ఎస్‌ ఓటమి

బిఆర్‌ఎస్‌ ఒక్కసీటు గెల్చినా లాభం లేదు   విజయ సంకల్ప యాత్రలో  కిషన్‌ రెడ్డి మంచిర్యాల, ప్రజాతంత్ర ,ఫిబ్రవరి23:  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుటుంబ పాలన ఖతమైందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపేర్కొన్నారు. కెసిఆర్‌ అవినీతే ఆయనను బొందపెట్టిందన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర లో కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ పాపాల…

భక్తులందరిపై సమక్క-సారలమ్మల దీవెనలు

అందరి సహకారంతో జాతర విజయవంతం రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23 : దక్షిణ తెలంగాణ కుంభమేలా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి 110 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు తమను ప్రోత్సహించారని రాష్ట్ర…

27న మరో రెండు హామీల అమలు ప్రారంభం…

రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త త్వరలోనే ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ నియామకం…జర్నలిస్టుల సమస్యల పరిష్కారం  సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అ మేడారంకు ప్రధాని రావాలి  ప్రపంచంలోనే గుర్తింపు పొందినా మహా జాతరను జాతీయ పండుగగా గుర్తించకుండా కేంద్రం వివక్ష    మేడారంలో మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి…

మేడారంలో శాశ్వ‌త అభివృద్ధి ప‌నుల కోసం క‌మిటీ

నిపుణులు, భ‌క్తులు, ఆదివాసీ సంఘాల స‌ల‌హాలు తీసుకుంటాం.. మేడారం జాత‌ర‌కు జాతీయ‌హోదా క‌ల్పించాలి.. సమ్మక్క సారలమ్మ  దీవెన‌ల‌తోనే  ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 27న రెండు గ్యారంటీల‌ను అమ‌లు చేస్తాం.. ప్రారంభోత్స‌వానికి ప్రియాంకా గాంధీ వ‌స్తారు.. మేడారం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 23 : నిపుణులు,  భక్తులు, ఆదివాసీ సంఘాల  అభిప్రాయాలు తీసుకొని  ఆదివాసీల సంప్రదాయాలకు అనుగుణంగా మేడారంలో…