NEWS

NEWS

తెలంగాణ అప్పులపై కెసిఆర్‌ ‌పెదవి విప్పాలి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 :  కోవిడ్‌ అనంతరం జీఎస్టీ రాబడులు గణనీయంగా పెరిగాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ అన్నారు. ప్రధాని మోదీ పారిశ్రామిక అభివృద్ధిపై ఫోకస్‌ ‌పెట్టాట్టారని చెప్పారు. దేశ యువత కోసం ప్రధాని నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. పార్లమెంట్‌లో నాడు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం…

డైనమిక్‌ ‌సిటీకి చేరుకున్నానంటూ మోడీ ట్వీట్‌

కార్యవర్గ సమావేశాలను ప్రారంభించిన నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : డైనమిక్‌ ‌సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. సిటీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ తెలుగులో ట్వీట్‌ ‌చేశారు. కాగా హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు…

ఇగోలతో పాలన చేయలేం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈగో పర్సన్‌ అని సినీ నటి, బీజేపీ నేత  కుష్బూ అన్నారు. ఒక లీడర్‌కు ఈగో ఉండకూడదని ఆమె తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గోనడం సంతోషంగా ఉందన్నారు కుష్బూ. రాజకీయపరంగా ఎలాంటి  విభేదాలున్నా.. ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర సీఎంగా ఆయనను రిసీవ్‌…

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన

యువతి అపహరణ… మతమార్పిడి పెళ్లి పేరుతో సామూహిక అత్యాచారం లక్నో, జూలై 2 : ఉత్తర ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. గోండా జిల్లాలో ఓ యువతిని బలవంతంగా మతం మార్చి, పెళ్ళి చేసుకుని, సామూహిక అత్యాచారం చేసినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ 23 ఏళ్ళ యువతి…

బేగంపేట్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌ ‌తమిళిసై, మంత్రి తలసాని

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌ ‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు గవర్నర్‌ ‌తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసానిశ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌విజయశాంతి,…

అల్లూరికి లాల్‌ ‌సలాం

‘ఆ చూపు మహోజ్వలితం ఆ రూపు దివ్య ప్రకాశితం ఆ గళం సింహా గర్జనం ఆ పిడికిలి విప్లవ సంకేతం ఆ ఆవేశం ఉత్తుంగ తరంగం ఆ అడుగు అభ్యుదయ పథం ఆ సాహసం అద్వితీయం ఆ సంకల్పం అజరామరం అతడే అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు దేశమాత స్వేచ్ఛ కోసం సాయుధ పోరు నడిపినవాడు…

దేశభక్తిలో ఒక మహోజ్వల శక్తి – తెల్లదొరలకు సింహస్వప్నం

మన్యం దొరగా, విప్లవజ్యోతిగా ఖ్యాతి గడించిన స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోది జూలై 4వ తేదీ  ఆంధ్రప్రదేశ్‌ ‌భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ  సందర్భంగా.. ప్రత్యేక వ్యాసంఊ భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర…

ఆత్మప్రబోధంతోనే వోటువేయండి

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధంతోనే వోటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్హులైన తమ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గతంలో వివి గిరి రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఇందిరాగాంధి పిలుపునిచ్చినట్లుగానే ఆత్మప్రబోధంతో తమ వోటును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎంపిలకు, ఎంఎల్‌ఏలకు కెసిఆర్‌ ‌ప్రబోధించారు. రాష్ట్రపతి డాక్టర్‌ ‌జాకీర్‌ ‌హుసేన్‌ అకస్మాత్తుగా 1969…

న్యాయవ్యవస్థ -రాజకీయాలు

మొ­త్తం వ్యవస్థను, ఆలోచనలను మొదటి నుంచీ మౌలికంగా పునర్నిర్మించవలసిన అవసరం ఉంది. అసలు రాజకీయ వ్యవస్థనే హక్కుల ఆధారిత వ్యవస్థగా పునర్వ్యవస్థీకరించవలసి ఉంది. అంటే ప్రతి మనిషికీ హక్కులు ఉన్నాయని గుర్తించవలసి ఉంది. అలా గుర్తించినప్పుడు మన సమాజంలో తోటి మనిషి పట్ల ఉన్నంత దుర్మార్గమైన ప్రవర్తనకు అవకాశం ఉండదు. అట్లాగే అప్పుడే అంతర్జాతీయ మానవ…

నుపుర్‌ ‌శర్మపై సుప్రీమ్‌ ‌కోర్టులో ఆగ్రహం

జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశం పిటిషన్లను దిల్లీకి మార్చాలన్న అభ్యర్థన తోసివేత పిటిషన్‌ ఉపసంహరించుకున్న నుపుర్‌ ‌శర్మ న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : ‌మహ్మద్‌ ‌ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్‌ ‌శర్మపై సుప్రీమ్‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యాఖ్యలు…