NEWS

NEWS

కొరోనా కేసులు తగ్గుముఖం

న్యూఢిల్లీ,జూలై18:  దేశంలో కొరోనా  కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం 20,528 కేసులు నమోదవగా, నేడు ఆ సంఖ్య 16 వేలకు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 16,935 మందికి పాజిటివ్‌ ‌వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,37,67,534కు చేరింది. ఇందులో 4,30,97,510 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,25,760 మంది మృతిచెందారు. ప్రస్తుతం…

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం…నర్మదా నదిలో పడ్డ మహారాష్ట్ర బస్సు

13 మంది ప్రయాణికులు మృతి సహాయక చర్యలు పర్యవేక్షించిన మంత్రి నరోత్తమ్‌ ‌భోపాల్‌,‌జూలై18: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు మరణించారు. ధార్‌ ‌వద్ద ఈ ఘటన జరిగింది. దుర్ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి…

శ్రీ‌లంకలో మరోమారు ఎమర్జెన్సీ

ఆదేశాలు  జారీ చేసిన తాత్కాలిక అధ్యక్షుడు కొలంబో,జూలై18 :  తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించటం లేదు. మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్‌ ‌విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించాయి. అయినప్పటికీ..…

జూలై 19…‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ కుదిరిన దినం

 ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ఏర్పాటు నేపథ్యం ఫజల్‌ అలీ కమిషన్‌ ‌నివేదిక ప్రాతి పదికగా, తెలంగాణ, విశాలాంధ్ర వాద నేతల చర్చోప చర్చలు అనుమానాలు సందేహాలు నివృత్తి అనంతరం జూలై 19న పెద్దమనుషుల ఒప్ప ందం కుదిరింది. ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు అనుకూలంగా మారింది. ఈ నేపద్యంలోకి వెళితే… ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం బ్రిటిషు పరిపాలనా కాల ంలో,…

మధ్యప్రదేశ్‌ 7 ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్లు గెలిచిన బీజేపీ కాంగ్రెస్‌ 3, ఆప్‌ 1 ‌లో విజయం

భోపాల్‌ ,‌జూలై 18: మధ్యప్రదేశ్‌ ‌మున్సిపల్‌ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ  మొత్తం 133 స్థానిక సంస్థలలో  105 స్థానాల్లో విజయం సాధించింది, అయితే రాష్ట్రంలో నాలుగు కీలకమైన మేయర్‌ ‌పదవులను కోల్పోయింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌మూడు మేయర్‌ ‌పదవులను గెలుచుకోగా, మొదటిసారి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఒకటి గెలుచుకుంది. 11 మునిసిపల్‌…

‘‌యువ’భారతంతోనే భారత భవిష్యత్తు

(భారత ప్రభుత్వ ‘జాతీయ యువజన పాలసీ-2021’ ముసాయిదా ఆధారంగా) జాతీయ యువజన పాలసీ-2014 లక్ష్యాల అమలు ఏ మేరకు సఫలం అయ్యాయనే సమీక్షతో పాటు మరి కొన్ని ముఖ్య అంశాలను జోడించిన భారత ప్రభుత్వం సరికొత్త నూతన ‘జాతీయ యువజన పాలసీ-2021’ ముసాయిదాను విడుదల చేసింది. దేశాభివృద్ధిలో యువత పాత్ర వెలకట్టలేనిదని, ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను…

పొలిటికల్‌ ‌బరస్ట్

‌రాష్ట్రంలో వరదల కారంణంగా ముంపుకు గురైన ప్రాంతాలను చూడడానికి వెళ్ళిన సందర్భంగారాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్ల్లోకూడా దీనిపై దుమారం లేస్తున్నది. గత వారంరోజులుగా దేశంలోని భిన్న ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాల వల్ల గోదావరి…

ప్రతి జిల్లాలో మెడికల్‌ ‌కళాశాల: వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అసంక్రమిత వ్యాధులను స్క్రీన్‌ ‌చేసిన ఏకైక రాష్ట్రం మనదే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 16 : ప్రతి జిల్లాకు మెడికల్‌ ‌కాలేజీ ఉండే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కాబోతున్నదని మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. ఎంబీబీఎస్‌, ‌పీజీ సీట్లను పెద్ద…

రైలులో నేడు ఉదయం మణుగూరుకు చేరుకోనున్న గవర్నర్‌

‌గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ ‌నేడు భదాద్రి-కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. శనివారం న్యూ దిల్లీలో రాష్ట్రపతి రామ్‌ ‌నాథ్‌ ‌కోవింద్‌ ‌వీడ్కోలు విందుకు ఆమె హాజరు కావల్సి ఉన్నా ఆ పర్యటనను రద్దు చేసుకుని ఆమె హదాద్రి వరద ప్రాంతాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. భద్రాచలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో వరద…

వరద ప్రాంతాల్లో నేడు సిఎం కెసిఆర్‌ ఏరియల్‌ ‌సర్వే

గోదావరి తీర ప్రాంతాల్లో హెలికాప్టర్‌ ‌ద్వారా పరిశీలన భదాద్రిలో అధికారులతో సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష సమావేశం గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదల నేపథ్యంలో నేడు ఏరియల్‌ ‌సర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఈ మేరకు సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం సిఎం ఏరియల్‌ ‌సర్వే చేపట్టనున్నారని వెల్లడించింది. కడెం…