సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: మహా టీవీ చానెల్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమర్థనీయం కాదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్‌చరించారు. ఈమేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.




