‘ఆర్యజనని’ సామాజిక సేవ అద్భుతం

– వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి

వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: రామకృష్ణ సేవా సమితి హనుమకొండ, ఆర్యజనని ట్రస్ట్‌, హైదరాబాద్‌ సంయుక్తంగా అవగాహన సదస్సును నిర్వహించడం ప్రశంసనీయమని గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గుండు సుధారాణి అన్నారు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే యోగ, ధ్యానం ఆసనాలతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం గురించి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లకు సేవా సమితి అధ్యక్షుడు కటంగూరి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన హనుమకొండ అంబేడ్కర్‌ భవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో తాను ముఖ్య అతిథిగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని సుధారాణి అన్నారు. ఇదేరోజు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, నీలిమల కుమారుడు నాయిని విశాల్‌ రెడ్డి దశాబ్ది వర్థంతి సందర్భం కావడం, వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరుపుకోవడం ప్రశంసనీయమన్నారు. నీలిమ రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామకృష్ణ సేవా సమితి నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు నిస్వార్ధ సేవా దృక్పథంతో కూడుకున్నవని, వారికి తమ సహాయసహకారాలు ఉంటాయని అన్నారు. గర్భస్థ శిశువు తల్లి జీవన విధానాన్ని, దిన చర్యనుబట్టి శిశువు ప్రవర్తన వస్తుందని, ఆరోగ్యవంతమైన జీవనశైలిలో భాగంగా గర్భిణులు, బాలింతలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతోపాటు యోగ, ధ్యానాన్ని అలవర్చుకునే విధంగా అవగాహన కల్పించాలని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్‌ సంధ్యారాణి అన్నారు. మూడు పద్ధతులను గర్భిణులు పాటించడం వలన శ్రేష్ఠమైన సంతానం కలుగుతుందన్నారు. ప్రముఖ వైద్య నిపుణులు శివసుబ్రహ్మణ్యం, లక్ష్మీనారాయణ, గైనకాలజిస్ట్‌ సౌమ్య, పిల్లల డాక్టర్‌ అశోక్‌ రెడ్డి, హోమియోపతి డాక్టర్లు పాల్గొన్నారు. గర్భస్థ శిశువు దశ నుండి ఆ శిశువు ఎదిగిన పరిణామక్రమం, తీరుతెన్నుల గురించి ఆర్యజనని టీమ్‌ సభ్యుల డెమో అందరి మన్ననలు పొందింది. జిల్లా శిశు సంక్షేమాధికారి, జయంతి, ఆర్యజనని సమన్వయకులు ఆనేటి దశరథం, సేవా సమితి సభ్యులు, విష్ణువర్ధన్‌ రెడ్డి, కే.వి.రావు, తిరువరంగం ప్రభాకర్‌, సూర్య, అరుణ్‌, రాధిక, అంజనీదేవి, తదితర టలంటీర్లు స్వంగా పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *