ఫిజిక్స్ అరుణ్ ‘బిగ్ బ్యాంగ్’ ఆవిష్కరణ

– అరుణ్‌ను అభినందించిన కేటీఆర్‌

సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్ కుమార్ తన రెండవ పుస్తకం ‘బిగ్ బ్యాంగ్’ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్లలో శుక్ర‌వారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ ప్రముఖ పత్రికల ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురితమైనవనీ.. ఇది వైజ్ఞానిక వ్యవహారిక వ్యాస సంపుటి అనీ, తెలంగాణ ఉద్యమ సమయంలో తానో టీచింగ్ ఫ్యాకల్టీగా జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని వివరించాననీ, ఉద్యమంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని అరుణ్ తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అరుణ్ను అభినందిస్తూ భవిష్యత్ తరాల విద్యార్థులకు తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూనే సామాజిక స్పృహతో ఇలాంటి మంచి రచనలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తుల ఉమ, ఫణి రాజారావు, నడిమెట్ల శ్రీనివాస్, హనుమాండ్ల జగదీష్, కామారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తన పుస్తకం సమాజంలోకి రావడంలో ప్రముఖ పాత్ర పోషించిన డాక్టర్ వెనిగళ్ళ రాంబాబు, రవికిరణ్ రెడ్డి, శ్రీనివాసులు, న‌రసింహారెడ్డి, నారాయణ, రాజేష్, సంతోష్, నవీన్, ఎల్లన్న తదితరులల అరుణ్ కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *