– సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం సాగుతున్నా
– ‘జాగృతి జనం బాట’లో అధ్యక్షురాలు కవిత
కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 1: జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర జిల్లా పరిధిలోఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు. నేను తెలంగాణ ప్రజల బాణాన్ని. ప్రజల కోసం, సమాజం కోసం నా గొంతు వినిపిస్తూనే ఉంటానని కవిత స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం అన్ని వర్గాల వారినీ కలుపుకొని ముందుకు సాగుతున్నాం. విద్య, వైద్యం వంటి కీలక అంశాలు ఇంకా జనాల మధ్య లోతుగా చేరాల్సి ఉందని కవిత తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడడంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేసిన ఆమె ఆర్టీసీ విభాగంలో ఉన్న సమస్యలపై విప్లవాత్మక ఆలోచన అవసరమని సూచించారు. సామాజిక తెలంగాణను సాకారం చేయడం మనందరి బాధ్యతని అన్నారు. తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి మనం అందరం కృషి చేశాన్నారు. కరీంనగర్ జిల్లాలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పంట నష్టంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు చనిపోతే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గురుకుల పాఠశాలల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలో మైనారిటీ సమస్యలను పట్టించుకోవాలి. మైనారిటీ అభివృద్ధికి కనీసం రూ.2,000 కోట్లు కేటాయించాలి. ఎన్నికలు సపించాకే మైనారిటీలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. తన రాజకీయ పరిస్థితిపై స్పందిస్తూ కవిత ఇప్పుడు నాకు ఎలాంటి బంధనాలు లేవు.. నేను ఫ్రీ బర్డ్‌ని. పర్యావరణ పరిరక్షణను మా జాగృతి ప్రాధాన్యంగా తీసుకుంటుంది. రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొంది.. ప్రజల గొంతుకగా మారబోతున్నాం అని తెలిపారు. మానకొండూర్ నియోజకవర్గంలో పంట నష్టం జరిగినా అక్కడి ఎమ్మెల్యే స్పందించలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ ఇప్పటివరకు కార్మిక చట్టాలపై స్పందించలేదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నిశ్శబ్దంగా వ్యవహరిస్తోందని కవిత పేర్కొన్నారు. తన రాజీనామా అంశంపై మళ్లీ చైర్మన్, స్పీకర్‌లను కలుస్తానని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



