– ప్రారంభించిన ప్రధాని మోదీ
-రూ.19,650 కోట్లతో అదానీ ఎయిర్‌పోర్ట్స్, సిడ్కో నిర్మాణం
ముంబై, అక్టోబర్ 8: అత్యాధునిక నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 అందుబాటులోకి వొచ్చింది. దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్, సిడ్కో మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 9 కోట్లు. హెవీ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ 3.25 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉండనుంది. ముంబై మెట్రో పాలిటన్ ప్రాంతంలో ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయం. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో రద్దీని దృష్టిలో పెట్టుకుని బహుళ విమానాశ్రయ వ్యవస్థ ద్వారా గ్లోబల్ సిటీస్‌లో ముంబై ప్రతిష్టను మరింత పెంచే లక్ష్యంతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు. కాగా, ముంబై మెట్రో లైన్-3కి చెందిన ఫేజ్ 2బిను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. అచార్య అత్రే చౌక్ (ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మనల్ దగ్గర) నుంచి కఫే పెరేడ్ వరకూ ప్రయాణం సాగించే ఈ నిర్మాణానికి రూ.12,200 కోట్లు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా ముంబై వన్ యాప్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. తద్వారా ప్రయాణికుల పలు ప్రయోజనాలు పొందవచ్చు. నైపుణ్యం, ఉపాధి, వ్యవస్థాపకత, ఆవిష్కరణ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో షార్ట్‌టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాంను కూడా ప్రధాని ప్రారంభించారు. ముంబయితోపాటు పుణె, కొంకణ్ ప్రాంతాలకు వాణిజ్య, పర్యాటకానికి మరింత ఊతం ఇస్తుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముంబయి దక్షిణానికి 37 కి.మీ దూరంలో ఉన్న ఉల్వేలో ఈ విమానాశ్రయం నిర్మించారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంలో రూ.19,650 కోట్లతో ప్రాజెక్టు తొలిదశ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక టెర్మినల్ అందుబాటులోకి రాగా ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి నాలుగు టెర్మినళ్లు ఉండనున్నాయి. 1160 హెక్టార్లలో ఈ విమానాశ్రయం విస్తరించి ఉంది. రన్‌వే పొడవు 3700 టర్లు. ఇలాంటివి రెండు రన్‌వేలు ఉన్నాయి. లోటస్ ఆకారంలో ఉన్న ఈ విమానాశ్రయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ డిజైన్‌కు బ్రిటిష్ అర్కిటెక్చరల్ సంస్థ జహా హదీద్ రూపకల్పన చేసింది. ప్రారంభంలో ఏటా రెండు కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించనుంది. ప్ర్రముఖుల కోసం లాంజ్‌లు, చిన్నారుల కోసం ప్రత్యేక జోన్లు, డిజిటల్ తెరలు, ప్రయాణికుల స్వల్పకాలిక విడిది కోసం ఎయిర్‌పోర్టు లోపల ఓ హోటల్ తదితర సదుపాయాలు ఉన్నాయి. ప్రారంభ కార్యక్రమంలో సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





