- 25 మంది మావోయిస్టులు మృతి
- మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గంగన్న మృతి
- మరొక కీలక నేతలు ఉన్నట్టు సమాచారం
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రజాతంత్ర, మే 21 : సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది భద్రత బలగాలకు maoists మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 25 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం మావోయిస్టులు అడవి ప్రాంతంలో సమావేశమయ్యారని సమాచారం తెలుసుకున్న భద్రత బలగాలు అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.
భద్రత బలగాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు జరపడంతో అందుకు ప్రతికటించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపారు .ఈ సంఘటనలో 25 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. నారాయణపూర్ ,దంతవాడ ,బీజాపూర్, కొండగావ్ జిల్లా పరిధిలో మావోయిస్టులు సమావేశమయ్యారని తెలుసుకొని సుమారు 2వేల మంది డి ఆర్ జి బలగాలు అడవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. భారీగా కాల్పులు జరపడంతో ఒక అగ్ర నేత మృత్యువాత పడ్డారు .
మృతి చెందిన వారిలో అగ్రనేత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న గా గుర్తించారు. ఈ సంఘటనలో మరి కొంతమంది కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. పోలీస్ అధికారులు మావోయిస్టు మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు.



