కేటీఆర్‌పై మరో కేసు నమోదు

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి ఫిర్యాదు నేపథ్యంలో..

 

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 14: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల కేటీఆర్‌ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని, అవి సీఎం ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ శనివారం ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలు సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఈ కేసుతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. కాగా, రాజకీయ కక్షలో భాగంగానే తమ నేతపై కేసులు పెడుతున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *