హైదరాబాద్‌ పాత బస్తీ విద్యార్థి దుర్మరణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6: అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన మరో వృక్తి మృతిచెందారు. మూడు రోజుల క్రితం డల్లాస్‌లో దుండగుడి కాల్పుల్లో విూర్‌పేట వాసి పోలే చంద్రశేఖర్‌ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా చికాగోలో ఇల్లినాయిస్‌ ఈవెన్‌స్టన్‌ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చంచల్‌గూడకు చెందిన షెరాజ్‌ మెహతాబ్‌ మొహమ్మద్‌ (25) చనిపోయారు. విషయం తెలసుకున్న అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఉన్నత అవకాశాల కోసం తమ కుమారుడు అమెరికాకు వెళ్లి చనిపోయాడంటూ షెరాజ్‌ తండ్రి అల్తాఫ్‌ మొహమ్మద్‌ కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడిరచారు. హైదరాబాద్‌లో బీడీఎస్‌ చదివి ఎండీఎస్‌ చదివేందుకు అమెరికా వెళ్లిన పోలే చంద్రశేఖర్‌(27) డాలస్‌లో దుండగుడి కాల్పుల్లో మరణించిన వార్త తెలిసి 48 గంటలు గడవకముందే అమెరికాలో మరో హైదరాబాదీ మృతిచెందడం గమనార్హం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *