అహ నా పెళ్ళంట సీన్‌ ‌బీఆర్‌ఎస్‌దే

– నిరుద్యోగులకు ఆశ చూపి పదేళ్ళు భోగం
– ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా నడిపిన చరిత్ర
– బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలది లోపాయకారి ఒప్పందం
– కెటిఆర్‌ ‌వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: అహ నా పెళ్ళంట మాట బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి సరిగ్గా సరిపోతుందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ కౌంటర్‌ ‌ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి, కేబినెట్‌లో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బీఆర్‌ఎస్‌ ‌పార్టీది అని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై మహేష్‌ ‌కుమార్‌ ‌తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ కు వోటేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గంలో బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బీఆర్‌ఎస్‌ ‌సహకరించిందని ఆరోపించించారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో గులాబీ బాస్‌, ‌మాజీ సీఎం కేసీఆర్‌ ‌పాత్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రపతి అధ్యక్ష పదవి మొదలుకొని ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌వరకు బీజేపీకి కేసీఆర్‌ ‌మద్దతు ఇచ్చారన్నారు. డబ్బుతో వోట్లను కొలవడమనేది అనైతిక చర్య అని పేర్కొన్నారు. ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌తక్షణమే కేటీఆర్‌ ‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో మెజారిటీ అమలు చేశామన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ హామీలు అమలు చేసి వోట్లు అడుగుతున్నదని చెప్పారు. రాష్ట్రం వొస్తే ఉద్యోగాలు వొస్తాయని అమాయకులైన నిరుద్యోగులను బలిగొన్న చరిత్ర బీఆర్‌ఎస్‌ ‌పార్టీదని మహేష్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌ అయ్యారు. పదేళ్ల పాలనలో కేసీఆర్‌ ‌కుటుంబంలో వారికి మాత్రమే ఉద్యోగాలు వొచ్చాయన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ ‌సాయం చేసిందని, ఆ రుణాన్ని బీజేపీ ఇప్పుడు తీర్చుకుంటున్నదని అన్నారు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ డ‌మ్మీ క్యాండిడేట్‌ ‌ను పెట్టిందని విమర్శించారు.  యూసుఫ్‌ ‌గూడలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో  ఆయన బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఫేక్‌ ‌హామీలతో మోసం చేసిందన్నారు. ఎంతమందికి రేషన్‌ ‌కార్డులు ఇచ్చారో చెప్పాలని నిల‌దీశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వొచ్చిన తర్వాత 4 లక్షల రేషన్‌ ‌కార్డులు ఇచ్చామని చెప్పారు. ఐదేండ్లు  మంత్రివర్గంలో మహిళా మంత్రి ఎందుకు లేరో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్‌ ‌ప్రయాణం కల్పిస్తే విమర్శిచడేంటని మండిపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *