వివాహ రద్దు ఫత్వాలు చెల్లవు

– మతపరమైన కమిటీలకు అధికారం లేదు
– మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు సంచలన తీర్పు

భోపాల్‌, ఆగస్ట్ 6 : ‌మసీదు కమిటీ ఫత్వాపై మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహాన్ని రద్దు చేసే అధికారం ఏ మతపరమైన సంస్థలు, కమిటీలు, లేదా సెమినరీలకు లేదని స్పష్టం చేసింది. కేవలం మసీదు కమిటీ జారీ చేసిన ఫత్వా ఆధారంగా వివాహ బంధం రద్దు అయినట్లు పరిగణించలేమని తేల్చిచెప్పింది. చట్టబద్ధమైన పక్రియను అనుసరించి రాజ్యాంగబద్ధమైన ఫ్యామిలీ కోర్టుల ద్వారానే విడాకులు పొందాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్‌ ‌వివేక్‌ ‌జైన్‌ ‌ధర్మాసనం తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా భోపాల్‌ ’‌దారుల్‌-‌దఫా మసాజిద్‌ ‌కమిటీ’ జారీ చేసిన ఫత్వా ఆధారంగా తన వివాహ బంధం రద్దు అయినట్లు ప్రకటించాలని కోరిన ఓ భర్త అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. ఫత్వాకు స్వతంత్రంగా చట్టపరమైన గుర్తింపు లేదని, అది కోర్టు తీర్పునకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది. వివాహ రద్దు వంటి అంశాల్లో తుది నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కోర్టులకే ఉంటుందని వెల్లడించింది. ఈ తీర్పు మతపరమైన ఫత్వాల చట్టబద్ధత, వివాహ రద్దు పక్రియపై కీలకమైన స్పష్టతను ఇచ్చిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *