అమెరికా వేదికగా తెలంగాణపై బీజేపీ గురి

– ప్రవాస భారతీయ సభలో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
– వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా ప్రసంగాలు

డల్లాస్, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీ రాయల్ అల్బర్ట్ హాల్‌లో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ(యూఎసఏ ఆఫ్ బీజేపీ) ఆధ్వరంలో మంగళవారం నిర్వహించిన ‘మీట్ అండ్ గ్రీట’లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక శక్తిగా ఎదిగిందని, మౌలిక సదుపాయాల కల్పనలో అపూర్యమైన పురోగతి సాధించిందని తెలిపారు. రానున్న జీహెచఏంసీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, శాసనసభ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆరఎస్ పదేళ్ల పాలన రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశాభివృద్ధి, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో విశేష పురోగతి సాధించిందని రామచందర్‌రావు తెలిపారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వందే భారత్ రైళ్లు, ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, పీనెం కిసాన్ వంటి పథకాలు దేశ అభివృద్ధికి దోహదపడ్డాయని వివరించారు. ఆర్టికల్ 370 రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర కోశాధికారి డి.వాసుదేవరావు మాట్లాడుతూ రామచందర్‌రావు నిజాయతీ, నిబద్ధత కలిగిన నాయకుడని కొనియడారు. యÖఎసఏ ఆఫ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల, కన్వీనర్ విలాస్‌రెడ్డి జంబులా తదితరులు మాట్లాడుతూ అమెరికాలో ఉన్న భారతీయులు దేశ భక్తి, జాతీయవాద భావజాలంతో బీజేపీకి అండగా నిలుస్తున్నారని, దేశాన్ని ప్రపంచలో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రవాస భారతీయులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని పేర్కోన్నారు. కార్యక్రమంలో అమర్ గోస్వామి, శరత్ వేముల, రఘువీర్ రెడ్డి, విజయ్ కుందూర్, ప్రవీణ్ తడకమý్ల, మధు బెల్లం, రామ్ వేముల, సాయినాధ్(దసరా), బస్వ శేఖర్, హనుమంత్, రవి పటేల్, సుబ్రమణ్యం, కల్పనా శుక్లా తదితరులతోపాటు అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి వందలాదిమంది ప్రవాస భారతీయులు, బీజేపీ నాయకులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో తాముకూడా భాగస్వాములమవుతామని వారు తెలిపారు. అతిథులను ప్రవాస భారతీయులు ఘనంగా సన్మానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *