– వ్యాపారిపై తల్వార్‌తో దాడి
హైదరాబాద్, ఫిబ్రవరి 12 హైదరాబాద్ పాత బస్తీలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా కాలాపత్తర్ ప్రాంతంలో రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమా హాస్పిటల్ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. రౌడీషీటర్ అసద్ తన అనుచరులతో కలిసి ఒక షాపు యజమాని ఖయ్యూంపై కత్తితో దాడికి తెగబడ్డాడు. తన మోటార్ సైకిల్‌పై కూర్చుని ఉండగా అసద్ గ్యాంగ్ ఆకస్మికంగా అతనిపై తల్వార్లతో విరుచుకుపడింది. దాడి అనంతరం వారు షాపులోని ఫ్రిడ్జ్‌ను ధ్వంసం చేసి షాపు అద్దాలను కూడా పగలగొట్టి హంగామా సష్టించారు. ఈ ఘటనతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. గాయపడిన ఖయ్యూంను హాస్పిటల్‌కు తరలించారు. ఈ రౌడీ షీటర్ పాత నేరస్తుడని పోలీసులు చెబుతున్నారు. అసద్ ఆగడాలపై అప్పటి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గతంలోనే పీడీ యాక్ట్ నమోదు చేశారు. అసద్ నేర ప్రవత్తిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు అతనిపై రాష్ట్ర బహిష్కరణ విధించారు. అయినప్పటికీ అసద్ పాత బస్తీలో ఎలా తిరుగుతున్నాడు.. ఈ దాడికి గల కారణాలేమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రౌడీషీటర్ల వరుస దాడులతో పాత బస్తీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





