వాచ్‌మన్‌కు మత్తుమందు ఇచ్చి చోరీ

– జూబ్లీహిల్స్‌లో ఘరానా దొంగతనం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 6: జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధి నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆ ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ ‌పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు రూ.20 లక్షల విలువ చేసే బంగారం, డైమండ్స్ ‌దోచుకెళ్లారు. నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. నందగిరి హిల్స్ ‌నుంచి జూబ్లీ చెక్‌ ‌పోస్ట్ ‌వరకు సీసీ టీవీలను పరిశీలించారు. మొదటగా ఆ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న వాచ్‌మన్‌కు మత్తుమందు ఇచ్చారు. వాచ్‌మన్‌ ‌మత్తులోకి జారుకోగానే దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. లాకర్‌లోని బంగారు ఆభరణాలు మొత్తం ఎత్తుకెళ్లారు. ఈ కేసులో పోలీసులు నలుగురు నేపాలీలను  ప్రధాన అనుమానితులుగా భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి దొంగల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దొంగలు నగరం విడిచి వెళ్లకుండా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లలో ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఈ తరహా నేరాలకు పాల్పడిన పాత నేరస్థుల జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. నగరంలో నేపాలీ గ్యాంగ్‌ల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పని మనుషులు, వాచ్‌మన్‌లను నియమించే సమయంలో వారి ఆధార్‌ ‌కార్డులు, పూర్తి వివరాలను స్థానిక పోలీస్‌ ‌స్టేషన్‌లో సమర్పించాలని పోలీసులు సూచిస్తున్నారు.
———————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *