– 16మంది కూలీల దుర్మరణం
షిల్లాంగ్, ఫిబ్రవరి 5:మేఘాలయలో బొగ్గు గనిలో గురువారం భారీ ప్రమాదం జరిగింది. అందులో పేలుడు సంభవించడంతో 16మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన కథనాల ప్రకారం.. గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో ఈ పేలుడు జరిగింది. దాంతో కూలీలు అందులో చిక్కుకుపోయారు. వారిలో ఎక్కువమంది అస్సాంకు చెందినవారిగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. అయితే పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. మేఘాలయలో ర్యాట్‌హోల్ మైనింగ్, అశాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలను 2014లోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ నిషేధించింది. సమాంతరంగా సన్నని గుంతలు తవ్వుతూ బొగ్గును బయటకు తీసే పద్ధతినే ర్యాట్ హోల్ మైనింగ్‌గా వ్యవహరిస్తారు. సుమారు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉంటుంది. ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలడు. కాగా, ఎన్‌జీటీ నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



