రూ.15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జోన్ ఎస్‌ఈ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి4: ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం పడింది. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ చిన్నారెడ్డి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారు. దీంతో జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టి రికార్డులు పరిశీలిస్తున్నారు. చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బిల్లులు మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని ఒక కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *