కంటతడి పెట్టిస్తున్న మృతుడి ఫోన్ కాల్ ఆడియో

– రక్షించాలంటూ వేడుకున్న ఇంతియాజ్

– నాంపల్లి ఫర్నీచర్ షాప్ అగ్నిప్రమాదం కేసు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: నాంపల్లి ఫర్నీచర్ షాపులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఒక బాధితుడి కాల్ రికార్డింగ్ ఆడియో లీకైంది. మృతుల్లో ఒకరైన ఇంతియాజ్ అనే యువకుడు అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి రక్షించమని వేడుకున్నాడు. తాను మంటల్లో లోపల చిక్కుకున్నట్లు, బయటకు రావడానికి ఏమీ కనిపించడం లేదని చెప్పాడు. అందులోంచి బయటకు రావడానికి అన్ని దారులు మూసుకుపోయాయని ఫోన్లో చెప్పాడు. తనతోపాటు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఇంతియాజ్‌కు సంబంధించిన ఈ ఆడియో వైరల్ అవుతోంది. ప్రాణాలు కోల్పోవడానికి కొద్దిసేపటి ముందు కాల్‌లో అతడి ఆవేదన అందరినీ కలిచివేస్తోంది. చివరి క్షణాల్లో బాధితుల వేదన కూడా రికార్డయ్యింది. ఘటనకు సంబంధించి.. సెల్లార్‌లోని ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగి, భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో లోపల ఉన్న ఐదుగురు అందులో చిక్కుకుపోయారు. చుట్టూ పొగ, మంటల ధాటికి బయటికి రాలేకపోయారు. బయటికొచ్చే ఏ మార్గం లేకపోవడంతో అందులోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 24న షాపులోని సెల్లార్‌లోఅగ్ని ప్రమాదం జరిగినప్ప్పుడు అందరూ బయటికొచ్చేశారు. లోపల గార్డు యాదయ్య కుమారులు ప్రణీత్, అఖిల్ ఉండిపోయారు. వారిని కాపాడేందుకు ఉస్మాన్ ఖాన్, ఆయన భార్య బేబి, ఇంతియాజ్ వెళ్లారు. చివరకు ఈ ఐదుగురు ప్రాణాలు కోల్ల్పోయిన సంగతి తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *