“ఒక్క రాచకొండ పరిధిలోనే ఈ స్థాయిలో పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, మైనర్ల పరిస్థితి ఏంటీ..?.ఇందిరమ్మ రాజ్యంలో ఈ స్థాయిలో మహిళలపై మైనర్లపై నేరాలు పెరిగితే ఇందిరా గాంధీకే అవమానం కాదా..?. .అందులో మహిళలు, మైనర్లపై వేధింపులు, హత్యాలు, అత్యాచారయత్నం జరుగుతుంటే మహిళలకు , మైనర్లకు రక్షణ ఎక్కడ ఉంటుంది.. క్రైం సీటీకి కంపెనీలు ఎలా వస్తాయి..మీరంటున్న ఫ్యూచర్ సిటి లో పెట్టుబడులు ఎలా వస్తాయి.. క్రైం రేట్ పెరుగుతుంటే తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుంది.. రాష్ట్రం క్రైంలో రైజింగ్ అవుతుంటే 3 ట్రిలియన్ ఎలా సాధ్యం అవుతుంది.”
తెలంగాణలో మహిళలు నేరాలు పెరుగుతున్నాయి, మైనర్లపై వేధింపులు ఎక్కువయ్యాయి. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో కంట్రోల్ ఉంటే, గత రెండేళ్లలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది.రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పినట్లు తాజాగా పోలీస్ శాఖ ఏడాది నివేదికలో స్పష్టమైంది. రాష్ట్రంలో మహిళలు, మైనర్లలపై నేరాలు పెరిగాయని పోలీస్‌శాఖ వార్షిక నివేదక చెప్పింది. .తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయలాంటిది. నగరంలో జరిగే ప్రతి నేరం రాష్ట్రం పై పడుతుంది.మూడు ముఖ్యమైన కమిషనరేట్లతో గ్రేటర్లో శాంతి భద్రతలు కాపాడుతుంది.
పదేళ్లు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి కేసీఆర్ శాంతి భద్రతలు అదుపులో ఉంచడమే కాదు, క్రైమ్ రేట్‌ను జీరోకు తగ్గించే ప్రయత్నం చేశారు..కానీ రెండేళ్లో హోం శాఖను తన దగ్గరే పట్టుకుని పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు..విపక్షాలపై కేసులు పెట్టడం, సిట్ల విచారణ పేరులతో డిపార్ట్ మెంట్‌ను వ్యక్తిగత ఎజెండాకు వాడుకుంటున్నారు. .దీంతో పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి ఫ్యాలెస్‌లో బంధి అయితే రాష్ట్రంలో నేరస్తులు స్వైర విహారం చేస్తున్నారు. రౌడీలు గూండాలు రెచ్చిపోతున్నారు.మహిళలు, మైనర్లలపై అత్యాచారాలు హత్యలు చేస్తున్నారు.ఏకంగా నగరం నడిబొడ్డున తుపాలకు గర్జిస్తున్నాయి. రౌడీల చేతుల్లో కత్తులు కోలాటం ఆడుతున్నాయి. అద్బుతమైన హైదరాబాద్ నేరాల నగరంగా మార్చారు.
తాజాగా రాచకోండ కమిషనరేట్ పరిధిలో జరిగిన నేరాలను సీపీ వార్షిక క్రైం నివేదికను విడుదల చేశారు..కమిషనరేట్ లిమిట్లో మహిళలు, మైనర్లపై కేసులు పెరిగాయని, వేధింపులు, పోక్సో కేసులు పెరిగాయని విడుదల చేసిన నివేదక చెప్పింది.ఏడాదిలో నాలుగు శాతం క్రైం రేట్ పెరిగి దాదాపు 33వేల క్రైం కేసులు నమోదయ్యాయాని ముఖ్యంగా మహిళలు, మైనర్లపై వేధింపు కేసులు పెరిగినట్లు వార్షిక నివేదక స్పష్టం చేసింది. ఒక్క రాచకోండ పరిధిలోనే ఈ స్థాయిలో క్రైం రేట్ పెరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి, మహిళ భద్రత, మైనర్ల భద్రతా ఎలా ఉందో ఊహించుకుంటునే ఆందోళన కలుగుతుంది. రాచకోండ పరిధి నగరానికి కీలక ప్రాంతం పెట్టుబడులకు వ్యూహాత్మక ప్రాంతం.. అలాంటి మూడు కమిషనరేట్ పరిధిలో ఉన్న హైదరాబద్ లో ఒక్క రాచకొండలోనే ఈ స్థాయిలో క్రైం రేట్ నమోదైతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి రేవంత్ రెడ్డి గారు. రాచకొండ పరిధిలో పెరిగిన కిడ్నాప్, పోక్సో కేసులు. 2025లో దాదాపు 33 వేల క్రైం కేసులంటే సరాసరిగా రోజుకు 90 కేసులు నమోదయ్యాయి..ఈ లెక్కన క్రైం రేట్ పెరిగితే మల్టీనేషనల్ కంపెనీలు ఎలా పెట్టుబడులు పెడతాయి.
ఒక్క రాచకొండ పరిధిలోనే ఈ స్థాయిలో పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, మైనర్ల పరిస్థితి ఏంటీ..?.ఇందిరమ్మ రాజ్యంలో ఈ స్థాయిలో మహిళలపై మైనర్లపై నేరాలు పెరిగితే ఇందిరా గాంధీకే అవమానం కాదా..?. .అందులో మహిళలు, మైనర్లపై వేధింపులు, హత్యాలు, అత్యాచారయత్నం జరుగుతుంటే మహిళలకు , మైనర్లకు రక్షణ ఎక్కడ ఉంటుంది.. క్రైం సీటీకి కంపెనీలు ఎలా వస్తాయి..మీరంటున్న ఫ్యూచర్ సిటి లో పెట్టుబడులు ఎలా వస్తాయి.. క్రైం రేట్ పెరుగుతుంటే తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుంది.. రాష్ట్రం క్రైంలో రైజింగ్ అవుతుంటే 3 ట్రిలియన్ ఎలా సాధ్యం అవుతుంది. క్రైం అభివృద్ధి రెండు ఒకే చోట ఎలా ఉంటాయి..మైనర్లపై వేధింపులు పెరిగితే మీరంటున్న విజన్ 2047లో వారి భాగస్వామం ఎలా ఉంటుంది..భవిష్యత్తు తరాలను చిదిమేస్తుంటే వాళ్ళు రేపు 3 ట్రిలియన్ ఎకానమీ లో ఎలా భాగస్వామ్యం అవుతారు.. మహిళాలపై నేరాలు పెరిగిపోతున్నాయి. వాళ్ళు రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటులో ఎలా కీలక పాత్ర పోషిస్తారు.మహిళా, రేపటి పౌరులకు ఇవాళ రాష్ట్రంలో రక్షణ లేకపోతే వారి భాగస్వామ్యం లేని తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది.
కోటి మంది మహిళాలను కోటిశ్వరులను చేస్తానంటి. కోటీశ్వరులను చేయడం ఏమోగానీ వారిపై జరుగుతున్న వేధింపులు,నేరాలను ప్రభుత్వం కట్టడి చేయలేకపోతున్నారు. ఎక్కడ మహిళాలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని పెద్దలు చెబుతారు..మరీ తెలంగాణ మహిళలు, మైనర్లపై నేరాలు జరుగుతున్నాయి అంటే కాంగ్రెస్ పాలన దేవుళ్ళు కాదు రాక్షసులు రాజ్యమేలుతోన్నాట్లే కదా.. కోటి మంది మహిళాలను కోటిశ్వరులను చేయడం తర్వాత ముందు వారికి రక్షణ కల్పించండి. ఫ్యూచర్ సిటి కాదు ఫ్యూచర్ జనరేషన్ ను కాపాడండి.. అందాల పోటీలు కాదు ఆడవాళ్ళకు రక్షణ కల్పించండి.. భారత సమ్మిట్, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లు కాదు ముందు తెలంగాణ తల్లులను, మన పిల్లలకు రక్షణ కల్పించండి.
భవిష్యత్తు పై వారికి భరోసా కల్పించండి..నేర రహిత, మహిళలు మైనర్లపై వేధింపులు లేని తెలంగాణను వారికి వాగ్ధానం చేయండి. .కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల బోగస్ ఒప్పందాలు కాదు తెలంగాణకు కావాల్సింది.. మహిళా భద్రత. ధైర్యంగా బయట తిరిగే భరోసా, రాష్ట్రాభివృద్ధిలో తాము భాగస్వామ్యం అవుతామన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించండి. ఉత్పత్తిలో , ఉద్యోగ రంగాల్లో మహిళాల పాత్ర లేకపోతే రాష్ట్ర అభివృద్ధి చెందుడు దేవుడెరుగు. రాష్ట్రం దివాలా తీస్తుంది.రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. .ప్రభుత్వం చెపుతున్న విజన్ 2047ను అందుకోవడం అసాధ్యం, కానీ ఆ వైపుగా అడుగులు వేయాలంటే మహిళల రక్షణ అవసరం..
మహిళాలు ఇప్పుడిప్పుడే ఛాందస సంప్రదాయాలను బద్దలు కొడుతూ బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. పురుషులతో పోటీ పడి ఉత్పత్తిలో శ్రమ శక్తిలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇప్పుడు ఇలా మహిళలపై మైనర్లపై నేరాలు పెరిగితే మళ్ళీ వాళ్ళు వంటింటికే పరిమితం అవుతారు..మైనర్లపై మానసిక, శారీరక, ఆరోగ్య సమస్యలతో భవిష్యత్తు తరాలు అనారోగ్య తెలంగాణ గా మారుతుంది. .మహిళలపై దాడులు జరిగే మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావు. తమ మహిళా ఉద్యోగులకు భద్రత లేకపోతే పెట్టుబడులు పెట్టవు.. తమ ఉద్యోగికి ఏ చిన్న ప్రమాదం జరిగిన అంతర్జాతీయంగా తన కంపెనీ బ్రాండ్ పడిపోతుంది.
అంతేకాదు ఆయా దేశాల్లో విచారణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా అని పూర్తిగా పురుషులతోనే సంస్థలు నడవవు.. మహిళలను కోటిశ్వరులను తర్వాత చేసుకోవచ్చు. ముందు మహిళా రక్షణపై దృష్టి సారించండి. సీఎం మీరే హోం మంత్రి మీరే హోంశాఖ తన దగ్గర ఉంటే క్రైమ్ రేటు తగ్గుతుందని, అధికారులు భయంతో పని చేస్తారని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు ఏడాదికేడాది క్రైమ్ రేట్ పెరుగుతుంది.ప్రభుత్వం, ముఖ్యమంత్రి కం హోం మంత్రి సమాధానం చెప్పాలి. మహిళలు,మైనర్ల రక్షణ లేని తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుంది. తెలంగాణ అభివృద్దిలో రైజింగ్ కావడం లేదు, క్రైంలో రైజింగ్ అవుతుంది.
– తోటకూర రమేష్





