– ప్రయాణికులు సురక్షితం
సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 5: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద బస్సు ప్రమాదం ఘటన మరువకముందే సంగారెడ్డి జిల్లాలో బుధవారం మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. అయితే ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి 65పై పటాన్‌చెరు మండలం ముత్తంగి వద్ద ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ముందున్న కారును తప్పించబోయి బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. మేడ్చల్ డిపోకు చెందిన ఈ బస్సు మేడ్చల్ నుంచి ఇస్నాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పటాన్‌చెరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. బస్సులో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగిందని నిర్దారించారు. అయితే ఆర్టీసీ బస్సులకు వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





